Saturday, July 24, 2021

కన్నకూతురే పోలీస్‌ స్టేషన్‌లో చెప్పుతో కొట్టింది

కామా తురానాం.. న భయం.. న లజ్జ అంటారు. కామంతో కళ్లు మూసుకుపోతే భయాలు.. సిగ్గు శరాలు ఉండవనేది దాని అర్ధం. ఇలా కామంతో కళ్లు మూసుకు పోయిన ఓ వృద్ధుడు 12 సంవత్సరాల పాపకు చాక్లెట్ల ఆశ చూపి పోర్న్‌ వీడియోస్‌ చూపించడం మొదలు పెట్టాడు. విషయంలోకి వెళితే చెన్నై నగరంలోని ఓ ఇంట్లో 68 సంవత్సరాల పుష్పరాజ్‌ నివశిస్తున్నాడు. ఇతని ఇంటికి కేర్‌ టేకర్‌గా ఓ మహిళ నియమింపబడిరది. ఈమెకు 12 సంవత్సరాల కూతురు కూడా ఉంది.

వీరు కూడా ఈ ఇంట్లోని ఔట్‌ హౌస్‌లో ఉంటున్నారు. సదరు పాప వచ్చినప్పుడు ఈ వృద్ధుడు ఆమెకు చాక్లెట్లు ఇస్తుండేవాడు. అలా అలా ఆ పాపకు ఆడుకోవడానికి సెల్‌ఫోన్‌ కూడా ఇవ్వడం మొదలు పెట్టాడు. అప్పటికే అతనికి పోర్న్‌ వీడియోస్‌ చూడడం హాబీగా ఉంది. అలా తాను చూసిందే కాకుండా ఆ పాపకు కూడా చూపించడం మొదలు పెట్టాడు. ఇలా వీడియోస్‌ చూపించడంతో పాటు ఆ పాపను కసితీరా బూతులు తిట్టి ఆనందపడేవాడు.

వీడియోస్‌ చూపించడంతో పాటు పాపను చెప్పుకోలేని చోట్ల తడమడం మొదలు పెట్టాడు ఆ వృద్ధుడు. అతని ప్రవర్తన సహించలేక తల్లికి ఉన్న విషయం మొత్తం చెప్పేసింది ఆ పాప. విషయం తొలుసుకున్న ఆ కేర్‌టేకర్‌ శివంగిలా మారి అతనికి దేహశుద్ధి చేసింది. విషయం పోలీస్‌ స్టేషన్‌ దాకా వెళ్లడంతో అతన్ని పోలీసులు అరెస్ట్‌ చేసి పోక్సో చట్టం కింద కేసు పెట్టారు.

తండ్రి ఇలాంటి అఘాయిత్యానికి ప్పాడడాన్ని తీవ్రమైన అవమానంగా భావించిన అతని కూతురు పోలీస్‌ స్టేషన్‌లోనే అతనితో మాట్లాడుతున్నట్లు నటించి చెప్పుతీసుకుని లాగి గూబపై కొట్టింది. అనుకోని ఈ సంఘటనకు ఆశ్చర్యపడిన పోలీసులు ఆమెను కంట్రోల్‌ చేసి బయటకు పంపారు. చిన్న పిల్లల పట్ల వావి వరసలు మరిచి ప్రవర్తిస్తున్న ఇలాంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనకు దిగాయి.

Related Articles

Latest Articles