ఎక్కడ తగ్గాలో కాదు.. ఎక్కడ నెగ్గాలో బాగా తెలిసిన పరిశ్రమ టాలీవుడ్. కాలమాన పరిస్థితులును ఎప్పటికప్పుడు తనకు అనుకూలంగా మార్చుకుంటూ.. అందరినీ ఏమార్చుతూ తమ పని కానిచ్చేయడంలో టాలీవుడ్‌ది అందె వేసిన చెయ్యి. కరోనా సమయంలో ఇక పరిస్థితి త్లలక్రిందులు అయిపోయిందని, సినీ పరిశ్రమ ఎలా గట్టెక్కుతుందోనని తెగ బాధ పడిపోయారు టాలీవుడ్ పెద్దలు. ఇక రెమ్యునరేషన్ దగ్గర నుంచి, ప్రొడక్షన్ కాస్ట్‌తో సహా ఇతర ఖర్చులు అన్నీ తగ్గించుకుని దిగిరాక తప్పదని అర్ధం చేసుకున్నారు.
దీనికి తగ్గట్లే భవిష్యత్తు సినీ నిర్మాణా లు , అమ్మకాలు, వసూళ్లు వంటి వాటి విషయంలో చూచాయగా ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే దాదాపు 10 నెలల పాటు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కరోనా ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. ఇదే సమయంలో వ్యాక్సిన్ కూడా వచ్చేసింది. దీనికి తోడు నిన్నటి దాకా 50 శాతం ఆక్యుపెన్సీ అంటూ కేంద్రం పెట్టిన నిబంధనలు కూడా సడలించింది. ఇలా అన్ని రకాలుగా దాదాపుగా మళ్లీ పాత పరిస్థితులు నెలకొన్నాయి.
పరిస్థితులతో పాటు మన సినీ జనాల పలుకులు మారిపోయాయి. నిర్మాణ వ్యయాలు , అమ్మకా లు మళ్లీ ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’, స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప’ సినిమా నైజాం రేట్లు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. మీడియం, చిన్న సినిమాల వ్యాపారం అయ్యా, బాబూ అంటూ వచ్చిన కాడికి ఫైనల్ చేసుకుంటూ ఉంటే ‘ఆచార్య’, ‘పుష్ప’లు మాత్రం జోరుగా బిజినెస్ చేసుకునే దిశగా పరుగు పెడుతున్నాయి.
టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కెర్లు కొడుతున్న వార్తల ప్రకారం ఈ రెండు సినిమాలు 25 కోట్లతో మొదలైనప్పటికీ బయ్యర్లు పోటీ పడి 35 కోట్ల రూపాయల వరకూ తీసుకు వచ్చినట్లు తెలిసింది. యూత్‌స్టార్ అల్లు అర్జున్‌తో పోటీ పడుతూ చిరు సినిమా కూడా 35 కోట్లు పలుకుతుండడంతో వార్ బన్ని వర్సెస్ చిరునా… చిరు వర్సెస్ బన్నినా అన్నట్లుగా మారిపోయింది.