ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం పై ఏ రేంజ్ లో నెగటివిటీ ఉందో మన అందరం చూస్తూనే ఉన్నాం. టీడీపీ – జనసేన కూటమి కలయిక దెబ్బకి ఈసారి వైసీపీ ఓడిపోవడం ఖాయం అని సర్వేలు సైతం చెప్తున్నాయి.
దీంతో జగన్ లో ఎన్నడూ లేని విధంగా వణుకు మొదలైంది. నియోజకవర్గాల వారీగా సర్వేలు చేయిస్తూ జనాల్లో వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్యెల్యేలను మార్చడం వంటివి చేస్తున్నాడు.
కొంతమందిని ఒక స్థానం నుండి మరో స్థానం కి బదిలీ చేస్తుంటే, మరి కొంతమంది సిట్టింగ్ ఎమ్యెల్యేలకు ఈసారి సీటు లేదని తేల్చి చెప్పేస్తున్నాడు.
ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలు మరియు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి 11 మంది ఇంచార్జిలను మార్పిడి చేసాడు. సీట్ ఇక దక్కదు అని తెలిసిన అభ్యర్థులు స్వచ్చందం గా పార్టీ కి రాజీనామా చేసి టీడీపీ , జనసేన లో చేరిపోతున్నారు.
సర్వేలు చేయించి మాపైనే వ్యతిరేకత ఉందని సీట్ అవ్వదట, వ్యతిరేకతని దృష్టిలో పెట్టుకుంటే అసలు వైసీపీ లో గెలిచినా ఎమ్యెల్యే అభ్యర్థులను మొత్తం మార్చేయాలి, ఎందుకంటే ఈ దరిద్రపు గొట్టు నీచమైన ప్రభుత్వం వల్లే మాకు వ్యతిరేకత వచ్చింది అని,
ఈ దరిద్రుడి పార్టీ నుండి బయటకి వచ్చి మంచి పనే చేసాము అంటూ మీడియా ముందు జగన్ పై నిప్పులు కక్కారు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మన పులివెందుల పులి, అలియాస్ సీఎం జగన్ అనంతపురం మరియు చిత్తూరు జిల్లాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితా ని పరిశీలించబోతున్నాడట.
రేపు చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఫైల్ జగన్ అన్నయ్య టేబుల్ మీదకి వచ్చిందట. ఈ మేరకు చిత్తూరు జిల్లా లోని నగరి ప్రాంతం నుండి పోటీ చేసే రోజా కి తాడేపల్లి ఆఫీస్ నుండి పిలుపు వచ్చినట్టు సమాచారం.
రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చార్ఛ్చ్ ఏమిటంటే నగరి లో రోజా కి జనాల్లో వ్యతిరేకత చాలా తీవ్రంగా ఉందని,ఈసారి ఆమెకి సీట్ దక్కకపోవచ్చు అని అంటున్నారు.
రేపు ఈ విషయం చెప్పడానికే జగన్ రోజా ని పిలిచినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమెకి ఈసారి టికెట్ లభిచకపోవడమో, లేకపోతే వేరే కొత్త స్థానం నుండి పోటీ చెయ్యడమో జరుగుతుంది. ఒకవేళ టికెట్ రాకపోతే రోజా వైసీపీ లోనే కొనసాగుతుందా లేదా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న