Wednesday, September 22, 2021

పెళ్లి చూడడానికి వచ్చిన అమ్మాయికి తాళి కట్టిన పెళ్లి కొడుకు

ఒక్కో సారి మన జీవితంలో అనుకోకుండా మలుపు తిరుగుతుంది. అలాంటి ఘటనే ఓ అమ్మాయి జీవితంలో చోటు చేసుకుంది. తమ బంధువుల పెళ్లి చూద్దామని వెళ్లిన ఓ అమ్మాయి అనుకోని ఘటన ఎదురైంది. ఆ పెళ్లికి తానే పెళ్లి కూతురిని అవుతానని కలలో కూడా ఉహించి ఉండదు. ఆ వివరాలలోకి వెళితే.. మహబూబ్‌నగర్ జిల్లా లో గుండెపూడికి చెందిన ఓ యువకుడికి పెళ్లి నిర్చయం అయింది. మరి కాసేపట్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురూరి మేడలో తాళి కట్టనున్నాడు. ఇంతలో పెళ్లి కూతురు అడ్డం తిరిగింది. తాను మరో యువకుడిని ప్రేమించానని, తనకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేస్తున్నారని ఆ యువతి పెళ్లి లో నుండే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ విషయంపై పోలీసులు ఆరా తీయగా.. ఆ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదని తెలిసింది. దీనితో పోలీసులు ఆమెకు నచ్చే చెప్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోవడంతో ఆమెను కౌన్సెలింగ్ కి పంపించారు. పెళ్లి కూతురే పోలీసులకు ఫోన్ చేసిందన్న విషయం తెలుసుకున్న ఆమె తల్లి తండ్రులు అవాక్కయ్యారు. అయితే ఈ మొత్తం ఘటనని పెళ్లి కొడుకు అవమానంగా భావించాడు. అదే సమయానికి అక్కడికి వచ్చిన వారి బంధువుల అమ్మాయి తల్లి తండ్రులతో సంప్రదింపులు జరిపి .. ఆ అమ్మాయి ఒప్పుకోవడంతో ఇరువురి పెళ్లి అదే సమయానికి జరిగింది.

Latest Articles