ఇసుక కొరతపై స్పందించిన ముఖ్యమంత్రి జగన్

0
770

గత కొన్ని రోజుల నుండి ఆంధ్రప్రేదేశ్ తో పాటు మరి కొన్ని రాష్ట్రాలలో ఇసుక కొరతగా ఉంది. దీనిపై ప్రతి పక్షాలు కూడా విమర్శలు చేయడం విశేషం. నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ కూడా మీటింగ్ పెట్టి మరీ దీనిపై విమర్శలు గుప్పించారు. ఐదు నెలలుగా రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరుగుతూ ఉందని అన్నారు. అలానే మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా దీనిపై నిప్పులు చెరిగారు. ఇసుకను బెంగళూరుకు పంపిస్తున్నారని ఆరోపించారు. 30 లక్షల మందికి పైగా ఉపాధి కార్మికులు పనుల్లేక అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ రంగ కార్మికుల బలవన్మరణాలు ఇక్కడ మాత్రమే ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు.

దీనితో ముఖ్యమంత్రి జగన్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. గత 90 రోజులుగా ఊహించని విధంగా వరద వస్తోందని చెప్పారు. అన్ని నదులు వరద నీటితో పోటెత్తుతున్నాయని, అందువలన 265 రీచ్ లలో కేవలం 61 మాత్రమే పని చేస్తున్నాయని తెలిపారు. వరద వస్తుండడంతో ఇసుక కోసం లారీలు, ట్రాక్టర్లు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. ఇసుక ఉచితం అని చెప్పి గత టీడీపీ పాలనలో ఇసుక మాఫియా నడిపించారని అన్నారు. ఇసుక సమస్య తాత్కాలికమేనని.. ఈ నెలాఖరులోగా ఇసుక సమస్య తీరుతుందని చెప్పారు. తమ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసేలా మర్గదర్శకాలను చేశామని చెప్పారు జగన్.