సీఎం జగన్ తానూ నమ్ముకున్న సిద్ధాంతాలకు కట్టుబడిన వ్యక్తి అని ఎన్నో సార్లు నిరూపితమైంది. అనైతికంగా రాజకీయ విలువలను మర్చిపోయి ప్రవర్తించకుండా ఉన్నాడు కాబట్టే నేడు జగన్ ఈ స్థాయి లో ఉన్నాడు.
తెలుగు దేశం పార్టీ అధికారం లోకి వచ్చిన తర్వాత అనైతికంగా వైసీపీ ఎమ్యెల్యేలను ఎలా కొనేసిందో, అలా జగన్ కూడా చేసి ఉంటే నేడు తెలుగు దేశం పార్టీ కి ఆ ప్రతిపక్ష హోదా ఉండేదా?.
కానీ జగన్ అలాంటి అనైతిక పనులు చెయ్యలేదు. మీరు రాజీనామా చేసి వచ్చే పని అయితేనే పార్టీ లో చేరండి. లేకపోతే నా పార్టీ లోకి రావొద్దు అని ధైర్యం గా చెప్పిన నేత బహుశా భారతదేశం జగన్ ఒక్కడే అని చెప్పాలి.
సామాజిక సాధికారత గురించి ప్రతీ రాజకీయ పార్టీ మాట్లాడుతూనే ఉంటుంది. కానీ సామాజిక సాధికారిత అంటే ఏంటో చూపించిన ఏకైక వ్యక్తి జగన్ ఒక్కడే.
నిన్న వైసీపీ పార్టీ 27 మంది ఇంచార్జిలతో కూడిన రెండవ లిస్ట్ ని విడుదల చేసింది. ఈ లిస్ట్ ని ఒకసారి పరిశీలిస్తే జగన్ సామజిక సాధికారత కోసం ఎంత కట్టుబడి ఉన్నాడో అర్థం అవుతుంది.
ఈ రెండవ లిస్ట్ లో అత్యధికంగా బీసీలు ఉండడాన్ని మనం గమనించొచ్చు. ఓసీ అగ్రకులం ఎక్కువగా ఉన్న చోట్ల బీసీ అభ్యర్థులకు స్థానం కలిపించడం జగన్ చిత్తశుద్ధికి కొలమానం అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
రెండవ లిస్ట్ బాగా పరిశీలిస్తే బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్ద పీట వేసినట్టు గా అర్థం అవుతాది. ఈ ఎన్నికలలో జగన్ 175 నియోజకవర్గాలను గెలిచే లక్ష్యం పెట్టుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే.
అదే నినాదం తో వైసీపీ అభ్యర్థులు కూడా ఎన్నికల బరిలోకి దూకుతున్నారు. ఆ నినాదం కి తగ్గట్టుగానే స్దాన మార్పిడి చేసి, కొత్తవాళ్లకు అవకాశం కల్పించి, జనాల్లో వ్యతిరేకత ఉన్నవాళ్లకు టిక్కెట్లు ఇవ్వకుండా దూరం పెట్టేసాడు.
ఇంతకు మించి సామజిక సాధికారత కి నిదర్శనం ఏంటో చెప్పాలి అంటూ రాజకీయ విమర్శకులు ప్రతిపక్షాలను ప్రశ్నిస్తున్నారు. మరి టీడీపీ – జనసేన కూడా ఇలా సామజిక సాధికారత తమ అభ్యర్థుల జాబితా విషయం లో అనుసరిస్తుందా లేదా అనేది చూడాలి.