కేసీఆర్ కి చుక్కలు చూపిస్తున్న జగన్..! 4 నెలల్లోనే ఇంత తేడానా?

0
1860

ఎన్నికల ముందు ఒకరికొకరు సహకరించుకున్నారు. ఎన్నికల తరువాత కూడా తెలుగు రాష్ట్రాలు బాగుండాలని అనేక సమస్యలపై పరిష్కారాలు వెతికారు. మంచి సన్నిహితులుగా మెలిగారు. కానీ ఆ నాయకుడే ఇప్పుడు మరో నాయకుడికి చుక్కలు చూపిస్తున్నాడు. ఆ నాయకులే ఒకరు జగన్ కాగా, మరొకరు కేసీఆర్. వీళ్ళిద్దరూ ఎన్నికల ముందు ఒకరికొకరు బాగానే సహకరించుకున్నారు. జగన్ ని ముఖ్యమంత్రి చేయాలని కేసీఆర్ కూడా తన వంతు కృషి చేశారు. ఎట్టకేలకు జగన్ ని ముఖ్యమంత్రి గా చూసి ఆనందించారు. ప్రమాణ స్వీకారానికి వచ్చి మరీ.. తన అభినందనలు తెలియచేసారు. తరువాత కూడా తెలుగు రాష్ట్రాలు బాగుండాలని అనేక సమస్యలపై పరిష్కారాలు వెతికారు. అందులో తమ వంతు విజయం సాధించారు. అయితే.. ఇప్పుడు కేసీఆర్ కి కలలో కూడా ఊహించని సమస్య ఎదురు అయింది. జగన్ తీసుకునే నిర్ణయాలే.. ఇప్పుడు కేసీఆర్ కి చుక్కలు కనిపిస్తున్నాయి.

జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకోసం కోసం నిర్ణయాలు తీసుకున్నారు. నిరుద్యోగులకు గ్రామ సచివాలయంలో ఉద్యోగాలు, RTC ని ప్రభుత్వంలో విలీనం చేయడం, కౌలు రైతుకు ఆర్థిక భరోసా, స్థానికులకు 70% ఉద్యోగ అవకాశాలు, విద్యారులకు అమ్మవడి పథకం, కంటి వెలుగు పథకం, 108 శాశ్వత పునరుద్ధరణ, 1000 రూపాయలు బిల్లు దాటితే ఆరోగ్య శ్రీ, అంగన్వాడీ, ఆశ వర్కర్లకు వేతనాలు పెంపు, సున్నా వడ్డీకే మహిళకు రుణాలు, మద్యపాన నిషేధం, ఆటో డ్రైవర్లకు 10 వేలు ఆర్థిక సాయం, సన్న,చిన్నకారు ,తోపుడు బండ్లు, నాయుబ్రహ్మణులకు 10 వేల చొప్పున వ్యాపార అభివృద్ధికి ఆర్థిక సాయం, బీసీ లకు 1000 కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్.. లాంటివి అనేకంగా ప్రవేశ పెట్టారు. అందులో ముఖ్యంగా RTC ని ప్రభుత్వంలో విలీనం చేయడం. ఇప్పుడు ఈ నిర్ణయాలు కేసీఆర్ కి మింగుడు పడడం లేదు. RTC ని ప్రభుత్వంలో విలీనం చేయాలనీ అటు తెలంగాణాలో టీఎస్ RTC గత కొన్నాళ్లుగా ఉద్యమం చేపట్టింది. ఇప్పుడు ఇది తెలంగాణాలో ముఖ్య సమస్య గా మారింది.

జగన్ తీసుకున్న నిర్ణయం.. తెలంగాణాలో కూడా ఆచరణలోకి తీసుకు రావాలని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. ఆంధ్రప్రేదేశ్ కన్నా.. తెలంగాణ రాష్ట్రం సంపన్న రాష్ట్రం అయినప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయాలు.. తెలంగాణాలో తీసుకోవడానికి వచ్చిన ఇబ్బంది ఏమిటని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనితో జగన్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు కేసీఆర్ కి గుది బండలా తయారు అవుతున్నాయి. జగన్ నిర్ణయాలు ఒక్క తెలంగాణలో నే కాకుండా.. అటు కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలను కూడా ఆలోచనలో పడుతున్నాయి. ఇదే సమస్య పక్క రాష్ట్రాలకు కూడా జగన్ నిర్ణయాలు గుది బండలా తయారు అవుతున్నాయి. ఆ రాష్ట్రాల ప్రజలు కూడా.. జగన్ లాంటి నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నారు. ముఖ్యమంత్రి అయిన నాలుగు నెల్లల్లోనే జగన్ దూకుడు.. ఇప్పుడు పక్క రాష్టాల ముఖ్యమంత్రులకు కంటి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.