అనుకున్నవి జరగకపోవడం.. అనుకోనివి అనుకోని సమయంలో జరగడం రాజకీయాల ప్రత్యేకత. వైయస్సార్ మరణం తర్వాత జగన్మోహన్రెడ్డి వెంట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎందరో నాయకులు నడిచారు. వారిలో మాజీ మంత్రుల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, చోటా మోటా నాయకులు, వైఎస్సార్ వీరాభిమానులు ఉన్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ ఆంధ్రప్రదేశ్‌లో ఊహించని ఓటమిని చవి చూడడంతో అందరూ ఢీలా పడిపోయారు. ఆ తర్వాత కేవలo ఆంధ్రప్రదేశ్‌ను మాత్రమే టార్గెట్‌గా పెట్టుకుని పనిచేసింది వైసీపీ.
ఇక్కడ తెలoగాణలో కూడా పార్టీ కేడర్ బలoగా ఉన్నప్పటికీ ఆంధ్రను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు జగన్. అయినప్పటికీ ఆంధ్ర మూలాలు కలిగి తెలoగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో నివశించే చాలా మంది నేతలు, ఇతర కేడర్ వ్యక్తులు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడం కోసం కుటుంబాను తెలoగాణలో వదిలిపెట్టి ఆంధ్రకు వచ్చి తీవ్రంగా శ్రమించారు. ఇలా అన్ని వర్గాల ప్రజల మద్దతుతో గద్దెనెక్కారు జగన్.
అయితే ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన తర్వాత ఆయన ప్రాధాన్యాలు మారిపోయాయి. పార్టీ కోసం పనిచేసిన వారికి ఆయన దర్శనం కరువైపోయింది. అసలు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేకు కూడా అపాయింట్మెంట్ దొరకడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. తెలoగాణ నుంచి ఆంధ్రకు వలస వెళ్లిన నాయకులు పార్టీ తమను పట్టించుకోక పోవడం, అధినాయకుడు అసలు కన్నెత్తి చూడక పోవడంతో దిక్కుతోచక కొట్టుమిట్లాడుతున్నారు.
ఇలాంటి పరిస్థితిలో షర్మిళ తెలoగాణలో నూతన పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించడంతో వీరంతా ఆంధ్రలో ఉండే కంటే తిరిగి తెలoగాణకు వెళ్లిపోవడమే బెటర్ అనే ఆలోచనకు వచ్చారు. ఇప్పటికే కొందరు మళ్లీ హైదరాబాద్‌కు చేరుకున్నారు. రాబోయే రోజుల్లో ఈ రిటర్న్లులు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది వైసీపీకి నష్టంగానే చెప్పుకోవాలి. పదేళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్నవారు ఇలా వెనుతిరగడం నైతికంగా వైసీపీ ఫెయిల్ అయినట్టే అని చెప్పాలి.