పని కోసమని 4 నెలల క్రితం చెన్నై వెళ్లిన భర్త

0
22865

సాధారణంగా ఏ భార్య అయినా అక్రమ సంబంధం పెట్టుకుంటే.. ఆ విషయం భర్త గుర్తించి పోలీసులకు చెబుతాడు. కానీ తమిళనాడులోని తిరువొత్తియూరులో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో.. చుట్టుపక్కన ఉన్న వాళ్ళు గుర్తించి ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వివరాలలోకి వెళితే.. తమిళనాడులోని తిరువొత్తియూరులో లక్ష్మి అనే 27 ఏళ్ల యువతి 25 ఏళ్ల వయసు ఉన్న సంతోష్‌ ని పెళ్లి చేసుకుంది. వీరి ఇద్దరూ కొన్నాళ్ళు బాగానే ఉన్నారు. అయితే పని కోసమని సంతోష్‌ 4 నెలల క్రితం చెన్నై వెళ్ళాడు. అంతే.. అప్పటి నుండి అతడి నుండి ఫోన్ కూడా లేదు. ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు. దీనితో ఏమి చేయాలో పాలు పోని లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆ సమయంలో పోలీస్ స్టేషన్ లో ఉన్న ఓ కానిస్టేబుల్ కి ఆమెకి పరిచయం ఏర్పడింది. విచారణ కోసం తరచూ ఆ కానిస్టేబుల్ లక్ష్మి ఇంటికి వచ్చేవాడు. అయితే ఈ క్రమంలో వారి ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం పెరిగింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయాన్ని ఇరుగుపొరుగు వారు గుర్తించారు. అయితే రెండు రోజుల క్రితం లక్ష్మి ఇంటికి అర్ధరాత్రి వచ్చాడు ఆ కానిస్టేబుల్. దీనితో ఇరుగుపొరుగు వారు ఆ ఇంటికి తాళం వేసి.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. అయితే సుప్రీం కోర్టు నిబంధలు ప్రకారం వీరికి ఏమి శిక్ష పడక పోవచ్చని భావిస్తున్నారు.