Wednesday, September 22, 2021

నాతో రిలేషన్ పెట్టుకో.. లేదంటే మన ఫోటోలు బయట పెడతా

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో ఓ వివాహేతర సంబంధం రోడ్డెక్కింది. నడి రోడ్డుపై డాక్టర్ నర్స్ గొడవకి దిగారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్స్ గా పని చేస్తున్న ఓ యువతి కి అదే ఆసుపత్రిలో డాక్టర్ మధ్య కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం నడుస్తుంది. అయితే ఇటీవల డాక్టర్ తీరు సరిగా లేకపోవడంతో అతనికి దూరమైనది యువతి. అయితే తనతో రిలేషన్ కొనసాగించాలని, లేదంటే తమ ఫోటోలు బయట పెడతానని డాక్టర్ బెదిరించాడని ఆ యువతి చెబుతుంది. అతడి మనుషులతో హత్యాయత్నం చేయించాడని ఆరోపిస్తుంది. తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది బాధితురాలు.

Latest Articles