ప్రియాంక రెడ్డి కేసులో మరో కీలక మలుపు

0
20099

ప్రియాంక రెడ్డి కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. విధుల్లో నిర్లక్ష్యం వహించారని నిర్ధారణకు వచ్చిన తరువాత ముగ్గురు అధికారులపై వేటు వేశారు. ప్రియాంక తల్లి తండ్రులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదనే ఆరోపణలతో ఈ వేటు పడింది. ఎస్సై రవి కుమార్, హెడ్డుకానిస్టేబుళ్లు వేణుగోపాల్ రెడ్డి, సత్యన్నారాయణ గౌడ్ లపై ఈ వేటు వేశారు. ఘటన జరిగిన రోజున ప్రియాంక తల్లి తండ్రులు పొలిసు స్టేషన్ ల చుట్టూ తిరిగారు. దీనితో సమయం వృధా అయింది. ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లిన సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు అభ్యంతకరంగా ఉందని ప్రియాంక తల్లి తండ్రులు తెలిపారు. పోలీసులు మాట్లాడిన మాటలు తమను ఎంతో బాధించాయని చెప్పారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు ఎస్సై రవి కుమార్, హెడ్డుకానిస్టేబుళ్లు వేణుగోపాల్ రెడ్డి, సత్యన్నారాయణ గౌడ్ లపై వేటు వేశారు.