నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన ‘డాకు మహారాజ్’ సంక్రాంతి పండగకు జనవరి 12న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొని ఉన్నాయి. పైగా బాలకృష్ణ ఈ మూవీలో మునుపేన్నడు చూడనటువంటి డిఫరెంట్ షేడ్ లో కనిపిస్తారు అన్న టాక్ నడుస్తోంది. ఇక చిత్ర బృందం కూడా మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ పై పూర్తి జోష్ కనబరిస్తోంది. జనవరి 4న విడుదల కాబోయే ట్రైలర్ చిత్రంపై అంచనాలను భారీగా పెంచుతుంది అని అందరూ భావిస్తున్నారు.అలాగే, ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటికే బాలయ్య, ఊర్వశీ రౌతేలా పై చిత్రీకరించిన పాటను విడుదల చేయగా, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ పాటలో బాలయ్య ఎనర్జిటిక్ స్టెప్పులు వేసిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఇక సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో అభిమానులు మరింత ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈసారి సంక్రాంతి బరిలో బాలయ్య చిత్రం రికార్డులన్నీ బద్దలు కొడుతుంది అని నందమూరి అభిమానులు ఆశిస్తున్నారు.
తాజాగా విడుదలైన కొత్త పోస్టర్లో బాలయ్య డాకూ గెటప్‌లో కనిపించాడు. చేతిలో కత్తి పట్టుకున్న బాలయ్య కొత్త లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. వరుస హిట్లతో జోష్ మీదున్న బాలయ్య ఈ సినిమాతో మరో బ్లాక్‌బస్టర్ కొట్టడం ఖాయమని అభిమానులు నమ్ముతున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. గతంలో ఈ బ్యానర్ నుంచి వచ్చిన ‘లక్కీ భాస్కర్’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అదే ఉత్సాహంతో నాగవంశీ ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధిస్తుందని భావిస్తున్నారు.
సంక్రాంతి బరిలో ‘డాకు మహారాజ్’ సహా మూడు సినిమాలు విడుదల కానున్నాయి. ప్రతి సినిమా ఒక ప్రత్యేక జోనర్లో ఉంటుంది. ఈ సినిమా విజయం సాధిస్తే బాలయ్య మార్కెట్ విలువ మరింతగా పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ‘డాకు మహారాజ్’ హిట్ అయితే అభిమానులకు సంక్రాంతి పండగ మరింత ప్రత్యేకంగా మారనుంది. ఇక బాలయ్య తన తర్వాతి సినిమా ‘అఖండ 2’ కోసం సిద్ధమవుతున్నాడు. అఖండ 1 బాలయ్య కెరీర్ కి బూస్ట్ ఇవ్వడంతో పాటు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. దీంతో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ ప్రాజెక్ట్ సీక్వెల్ పై కూడా భారీ అంచనాలున్నాయి.