Tuesday, May 18, 2021

ర‌జినీకాంత్ కు దాదా సాహెబ్ పాల్కే అవార్డ్ ఓకే….మ‌రి తెలుగులో ఈ అవార్డ్ ఎవ‌రెవ‌రికి ద‌క్కిందో తెలుసా?




సినిమా రంగంలో విశేష సేవ చేసిన వారికి అందించే అత్యుత్త‌మ‌మైన అవార్డ్ దాదా సాహెబ్ పాల్కే అవార్డ్…. ఇండియాలో మొట్ట మొద‌టి సినిమా అయిన రాజా హ‌రిశ్చంద్ర మూకీ సినిమాను తీసింది ఈయ‌నే….ఈయ‌న సినిమా కోసం విశేష కృషి చేశారు. అందుకే ఈయ‌న పేరు మీద భార‌త ప్ర‌భుత్వం 1969లో ఈ అవార్డ్ ను క్రియేట్ చేసింది.

మొట్టమొదటి సారిగా 1969 లో ఈ పురస్కారాన్ని నటీమణి దేవికా రాణికి అందుకుంది. ఇప్పుడు తాజాగా ర‌జినీకాంత్ అందుకున్నారు. అయితే తెలుగు చిత్ర‌సీమ నుండి ఈ అవార్డ్ అందుకున్న వాళ్లెవ్వ‌రో ఇప్పుడు చూద్దాం!

తెలుగు సినిమా రంగం నుండి దాదాసాహెబ్ పాల్కే అవార్డులు అందుకున్నవారు :

1) బియ‌న్ రెడ్డి- ద‌ర్శ‌క నిర్మాత
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి దక్షిణ భారతీయుడు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి. ఎవ‌ర్ గ్రీన్ మ‌ల్లీశ్వ‌రి ఈయ‌న తీసిన సినిమానే!

2) పైడి జ‌య‌రాజ్
క‌రీంన‌గ‌ర్ కు చెందిన జైరాజ్ …హైద్రాబాద్ నిజాం కాలేజ్ లో చ‌దువుకుంటున్న రోజుల్లో సినిమాపై ఇష్టంతో అటువైపుగా వెళ్లారు దాదాపు 300 సినిమాల్లో న‌టించారు.

3) ఎల్వీ ప్ర‌సాద్ :
సినీనిర్మాత, దర్శకుడు, నటుడు అయిన ఎల్వీ ప్ర‌సాద్… తొలి టాకీ చిత్రాలయిన ఆలం ఆరా, కాళిదాసు భక్తప్రహ్లాద మూడింటిలోనూ నటించారు.

4) బి. నాగిరెడ్డి

నిర్మాతగా వ్య‌వ‌హ‌రించిన నాగిరెడ్డికి దాదాసాహెబ్ పాల్కే అవార్డ్ ల‌భించింది. విజ‌యా ప్రొడ‌క్ష‌న్స్ ఈయ‌న నిర్మించిన‌దే.

5) అక్కినేని నాగేశ్వ‌ర్రావ్ :
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 256 సినిమాల్లో నటించిన నాగేశ్వ‌ర్రావ్ గారికి కూడా ఈ అవార్డ్ ద‌క్కింది.

6) ద‌గ్గుబాటి రామానాయుడు :
ఒకే వ్య‌క్తి దాదాపు 100 సినిమాల‌ను నిర్మించి గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్ సృష్టించాడు. ఈయ‌న సినీ రంగానికి చేసిన సేవ‌కు గాను ఈ అవార్డ్ ల‌భించింది.

7) కె. విశ్వ‌నాథ్
క‌ళా త‌ప‌స్విగా పేరుగాంచిన విశ్వ‌నాథ్ గారికి 2016లో ఆ అవార్డ్ ల‌భించింది.





Related Articles

Latest Articles