పాపం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పరిస్థితి ముందు నుయ్యి.. వెనక గొయ్యి అన్న చందంగా మారింది. ఓవైపు వివిధ వర్గాల ప్రజలు తమకు ఇచ్చిన హామీలను అమలు చేయక పోవడంతో దమ్మెత్తి పోస్తుండగా, మరోవైపు ప్రతిపక్షాలతో పాటు స్వపక్షానికి చెందిన వ్యక్తులు సైతం జగన్ పాలనను తీవ్రంగా నిరసిస్తున్నారు.
నిన్నటికి నిన్న మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కారంచేడులో ప్రజలతో మాట్లాడుతూ తాను 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పర్చూరు నియోజకవర్గం నుంచి ఓడిపోవడమే మంచిదైందని, లేకపోతే ఈ రోడ్లమీద నడవడానికి సిగ్గుపడాల్సి వచ్చేదని జగన్‌కు చురకలంటించారు.
జగన్ కోసం పడిగాపులు కాస్తున్న చంద్రబాబు..!
తాజాగా ఈరోజు ఆయన భార్య, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి రాజమండ్రిలో మీడియా సమావేశంలో జగన్‌పై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…
ఆంధ్రప్రదేశ్‌లోని రోడ్ల గురించి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ జరుగుతున్నాయి. మన రోడ్ల ఫొటోలను పెట్టి ఇవి చంద్రమండలం నుంచి చంద్రయాన్ పంపినవి అని నవ్వుకుంటున్నారు.
అలాగే గోదావరి జలాల పరిరక్షణకు కేంద్రం నిధులు ఇస్తున్న సందర్భంలో దాని మీద కనీసం ఈ పాలకులు దృష్టి సారించడం లేదు. అదే విధంగా టిడ్కో ఇళ్లు కూడా.
ఇప్పటికీ 80 శాతం ఇళ్లను అబ్ధిదారులకు పంపిణీ చేయలేదు. అలాగే పేదలకు ఇళ్లపట్టాల పేరుతో పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ మడ అడవులను సైతం వదలకుండా దోచుకున్నారు.
ఇలా ఏ వర్గానికీ న్యాయం చేయకుండా అవినీతిలో కూరుకుపోయారు. మొన్న నేను కడియపులంకకు వచ్చాను. అక్కడ ఇసుక మాఫియా విశృంఖలంగా తయారైంది.
ప్రజావేదిక కూల్చివేతతో ఈ పరిపాలన ప్రారంభం అయింది. ఆరోజు నుంచి ఈ రోజు వరకూ విధంసమే. ఎవరైనా అన్యాయాన్ని ప్రశ్నిస్తే వారిపైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కడుతున్నారు,..
ఈరకమైన పరిపాలన మనకు అవసరమా అని ప్రజలు ఆలోచించుకోవాలి. సుపరిపాలన అన్న పదానికి నిజమైన అర్ధం భారతీయ జనతాపార్టీ. ప్రజలందరూ రాబోయే రోజుల్లో ఈ విధ్వంసకర పార్టీకి బుద్ధిచెపుతారు’’ అన్నారు.