సంక్రాంతి అంటేనే శనీలవస్ పండుగ అని అర్థం. టాలీవుడ్ లో ఈసారి కూడా సంక్రాంతి బరిలో బడా హీరోల సినిమాలు బీభత్సం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే ఉన్న అన్ని సినిమాలలోకి బాలకృష్ణ డాకు మహారాజ్.. రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రాలు నందమూరి బాలకృష్ణ తన స్టైల్, మాస్ అప్పీల్‌తో “డాకు మహారాజ్” అంటూ సందడి చేయబోతున్నారు. మరోవైపు రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ”గేమ్ చేంజర్” సినిమాతో త్రోబాక్స్ హిట్ కోసం రెడీగా ఉన్నాడు.
ఆరుపదుల వయసులో వరుసహిట్ లతో మంచి ఫామ్ లో ఉన్న బాలకృష్ణ ఒకవైపు.. ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో సోలో చిత్రంతో బలిలోకి దిగుతున్న రామ్ చరణ్ మరోవైపు.. దీంతో సంక్రాంతి సినిమా సందడి మామూలుగా లేదు.సంక్రాంతి పండుగ వాతావరణంలో ఈ రెండు సినిమాలు టాలీవుడ్‌లో ప్రత్యేకమైన హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే బాలకృష్ణ ,రామ్ చరణ్ ఇద్దరూ ”అన్‌స్టాపబుల్ షో”లో పాల్గొని, తమ బాండింగ్‌ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమం తర్వాత సోషల్ మీడియాలో “డాకుతో గేమ్ చేంజర్” అనే ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. సంక్రాంతికి ఈ రెండు చిత్రాలు వేరువేరుగా కాకుండా, ప్రేక్షకులను కలిపి ఉత్సాహభరితమైన అనుభూతిని అందించబోతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తాజాగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, ‘సంక్రాంతికి అందరి సినిమాలు హిట్ కావాలి. ఇలాంటి టైమ్‌లో అందరూ కలిసిపోయి సినిమాలను ఎంజాయ్ చేయాలి. అదే ఇండస్ట్రీ అభివృద్ధికి దోహదం చేస్తుంది’’ అని చెప్పాడు. అలాగే, ”డాకు మహారాజ్” నిర్మాత నాగవంశీ ఇటీవల సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చాడు. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తనను ఎంతగానో ఆకట్టుకుందని, ఇది ప్రేక్షకుల్ని థియేటర్‌ల్లో ఓ రేంజ్‌లో ఎంటర్‌టైన్ చేస్తుందని ట్విట్టర్‌లో తెలిపారు. “జనవరి 12న శివ తాండవమే” అంటూ తమన్ ఆర్ఆర్‌పై హైప్ క్రియేట్ చేశారు.
ఈ సంక్రాంతికి తమన్ తన మ్యూజిక్‌తో థియేటర్లలో ఓ రేంజ్ లో బీభత్సం సృష్టించబోతున్నాడు. గేమ్ చేంజర్‌కి ఆయన అందించిన సంగీతం ఇప్పటికే అంచనాలను పెంచుతోంది. అదేవిధంగా ”డాకు మహారాజ్” బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చేలా ఉంది. ఒకవైపు గేమ్ చేంజర్, మరోవైపు డాకు మహారాజ్ చిత్రాల మ్యూజిక్ కంపోజింగ్‌లో తమన్ తనతో తానే పోటీ పడుతున్నాడు.
మరోవైపు, ”డాకు మహారాజ్” నుంచి భీమ్స్ అందించిన పాటలు కూడా మంచి స్పందన తెచ్చుకుంటున్నాయి. ఈ సంక్రాంతికి ఈ రెండు పెద్ద చిత్రాలు ఎలా నడుస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇండస్ట్రీకి శుభారంభం అందిస్తాయా? సంక్రాంతి బరిలో వీటి టాక్ ఎలా ఉండబోతుందన్నది సినిమా ప్రియులంతా ఎదురు చూస్తున్నారు.