ప్రస్తుతం టాక్ ఆఫ్ ద టౌన్ గా ఉన్న పుష్ప చిత్రంలో మ్యూజిక్ ఏ రేంజ్ హైలైట్ అయిందో అందరికీ తెలుసు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ చాలా వరకు సంగీతాన్ని అందించారు. అయితే మరో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఈ సినిమా కోసం పని చేశారు అన్న టాక్ నడుస్తోంది. తమన్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది.పూర్తి బిజిఎం ఇవ్వాల్సి ఉన్నా 15 రోజుల్లో వర్క్ పూర్తికాదు అనే ఉద్దేశంతో ఒక ఎపిసోడ్ కి మ్యూజిక్ ఇచ్చినట్లుగా తమన్ వెల్లడించారు.
అయితే ఈ విషయం నచ్చని దేవి శ్రీ ప్రసాద్.. ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాతలపై తన అసంతృప్తిని డైరెక్ట్ గానే వెల్లడించారు. కట్ చేస్తే ఇప్పుడు పుష్ప 2 విడుదలైన తర్వాత దేవి శ్రీ ప్రసాద్ తో పాటు సామ్ సిఎస్ అడిషనల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టైటిల్ క్రెడిట్ దక్కించుకున్నాడు. ఇప్పుడు ఈ నేపథ్యంలో గతంలో సామ్ సిఎస్ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ వైరల్ అవుతుంది. దీంతో పాటుగా అసలు సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరు ఇచ్చారు అన్న విషయంపై కూడా హాట్ డిస్కషన్ నడుస్తోంది.
గతంలో ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చిన సామ్ సిఎస్.. పుష్ప 2 మూవీకి సంబంధించిన మాక్సిమం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తానే ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయితే మొత్తం మ్యూజిక్ దేవి శ్రీ వరప్రసాద్ అందించగా ఏదో కొంత భాగానికి బిజిఎం కోసం సాం సిఎస్ ని వాడుకున్నట్టు టైటిల్స్ లో వేశారు. ఇక ఇప్పుడు ఈ రెండిటిలో ఏది నిజం అన్నదానిపై ఒకవైపు డిస్కషన్ జరుగుతున్నప్పటికీ మరోవైపు ఈ మూవీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఇరగదీస్తోంది.
మరి ముఖ్యంగా ఈ చిత్రానికి జాతర ఎపిసోడ్ విజువల్స్ ఎంత హైలెట్గా నిలిచాయో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంతకంటే హైలైట్ గా నిలుస్తుంది. ఇక ఫ్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ లో బిజిఎం గూస్ బంప్స్ తెప్పిస్తోంది. మొత్తానికి ఎన్నో పేర్లు తెరమీదకి వచ్చినప్పటికీ చివరికి దేవిశ్రీప్రసాద్ అందించిన మ్యూజిక్ ని ఈ చిత్రానికి వాడారు అన్న విషయం చూచాయిగా అర్థమవుతోంది. అయితే థమన్ స్వయంగా తాను ఓ ఎపిసోడ్కి మ్యూజిక్ ఇచ్చాను అని చెప్పినప్పటికీ ఎక్కడా అతని పేరు మెన్షన్ చేయలేదు. దీన్నిబట్టి అతని ఇచ్చిన మ్యూజిక్ ఎక్కడ వాడలేదు అన్న విషయం అర్థం అవుతోంది.