తెలంగాణాలో జరిగిన ఎన్ కౌంటర్ పై మంచు లక్ష్మి స్పందన

0
13849

తెలంగాణాలో జరిగిన ఎన్ కౌంటర్ పై ప్రముఖ నటి మంచు లక్ష్మి స్పందించారు. జరిగిన సంఘటనపై దేశవ్యాప్తంగా అందరూ స్వీట్లు పంచుకోవడాలు, డాన్స్ లు చేయడాలు చూస్తుంటే మన దేశానికి మంచి రోజులు వచ్చాయేమో అని అనిపిస్తుందని మంచు లక్ష్మి అన్నారు. ఒక తప్పుకు తీర్పు వెంటనే దొరికినందుకు సంతోషమని అన్నారు. కానీ ఇది నిజంగా తీర్పు అవుతుందా? అని ప్రశ్నించారు. చేసిన దాంట్లో తనకు నూటికి వెయ్యి శాతం సంతోషంగా ఉందని చెప్పారు. కానీ.. ప్రతి సారి ఎన్ కౌంటర్ చేసి చంపలేము కదా? అని అన్నారు. ఎంత మందిని ఎన్కౌంటర్ చేసుకుంటూ ముందుకు వెళతారు? అని ప్రశించారు. ఇప్పుడు చనిపోయిన నలుగురు అబ్బాయిల తల్లి తండ్రులు ఎంత కుమిలి పోయి ఉంటారు? అని ప్రశ్నించారు.

వాళ్ళను చూస్తుంటే.. చదువు కున్నవాళ్ళలా లేరు. ఎంతో కష్టాలు పడి, ఎన్ని గడపలు తొక్కి వాళ్ళ కొడుకులను 20 ఏళ్ళు పెంచుకుని ఉంటారు. ఇంత కష్టపడి పెంచుకున్నా కూడా ఇలా దారుణంగా చనిపోయారు. ఇలా ఎందుకు జరుగుతుందని ప్రశ్నించారు. నిర్భయ కేసులో ఆ రాడ్ వాడిన వ్యక్తి ఈ రోజు మన దేశంలో ఫ్రీగా తిరుగుతున్నాడు. అదేమీ తీర్పు అని ప్రశ్నించారు. మేము ఇస్తున్న టాక్స్ డబ్బులతో వారికి పోలీసుల కాపలా పెట్టి, మూడు పూటలా భోజనాలు పెడుతున్నారు. ఇదే అందరం ప్రశ్నించాలని కోరారు.