ప్రస్తుతం ఎక్కడ చూసినా అక్కినేని ఇంట్లో జరగబోయే పెళ్లి ముచ్చట్లే వినిపిస్తున్నాయి. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య జీవితంలో ఏం జరుగుతుంది అన్న ఇంట్రెస్ట్ ఎంతోమందిలో కనిపించింది. అయితే తాజాగా అతను శోభితతో తన రిలేషన్షిప్ అనౌన్స్ చేయడంతో పాటు ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. ఇక డిసెంబర్లో వాళ్ళ పెళ్లి కూడా జరగబోతోంది. దీనికి తోడు ఎప్పుడు లేటెస్ట్గా అఖిల్ ఎంగేజ్మెంట్ న్యూస్ వైరల్ అవుతుంది.
ఈ నేపథ్యంలో అఖిల్ పెళ్లి చేసుకోపోయే అమ్మాయి, ఆమె కుటుంబం గురించి తెలుసుకోవాలి అని ఎందరో ఆశపడుతున్నారు. ఈ ఇద్దరు ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటా అని గూగుల్‌లో ఆరాలు తీస్తున్నారు. అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకున్న వ్యక్తి పేరు జైనాబ్ రావుద్జీ…ఆమె దుబాయ్ కి చెందిన ఒక మోడల్ అన్న విషయం అందరికీ తెలుసు.
అయితే ఇప్పుడు ఆమెకు సంబంధించిన ఎన్నో వివరాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దుబాయిలో జైనాబ్ అప్ మంచి ఫేమస్ మోడల్ అట్టా.. ఆమె ఇప్పటివరకు సినిమాల్లో నటించలేదు కానీ మోడలింగ్‌లో మాత్రం ఓ రేంజ్ లో పాపులారిటీ సంపాదించింది. మోడలింగ్ తో పాటు సినిమాల్లో చేయాలి అన్న ఆలోచన ఉన్న జైనాబ్ మరి పెళ్లి తర్వాత ఏం డెసిషన్ తీసుకుంటుందో చూడాలి.
ఇక జైనాబ్ తండ్రి గురించి తెలిస్తే షాక్ అవుతారు. ఆయన దుబాయిలో ఒక ప్రముఖ వ్యాపారవేత్త.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కడ అక్కినేని కుటుంబానికి ఎంత పాపులారిటీ ఉందో గల్ఫ్ దేశాలలో రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన వ్యాపారాలలో రావుద్జీ ఫ్యామిలీకి అంతే రేంజ్ ఉంది. జుల్ఫీ రావుద్జీ గల్ఫ్ దేశంలో ఓ పెద్ద రియల్ ఎస్టేట్ టైకూన్ అనడంలో డౌట్ లేదు.
సుమారు 30 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్నాడు. అంతేకాదు ఆంధ్రలో వైఎస్ జగన్ ప్రభుత్వం నడిచిన సమయంలో ఆయన సలహాదారుడుగా కూడా వ్యవహరించారట. గతంలో బంజారాహిల్స్ లో నివాసం ఉండే రావుద్జీ కి అప్పటి జగన్ ప్రభుత్వం క్యాబినెట్ మినిస్టర్ హోదా ఇచ్చిందని టాక్.
తాజాగా అఖిల్ కి కాబోయే మామ వివరాలు బయటపడడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. మరోపక్క అఖిల్ సూపర్ జాక్‌పాట్ కొట్టాడు అని కూడా అందరూ అంటున్నారు. త్వరలోనే వీరి పెళ్లి డేట్ కూడా అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.