గృహ హింస కేసులో యువరాజ్‌ సింగ్‌ కి ఊరట

0
1649

టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ కి గృహ హింస కేసులో ఊరట లభించిందని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. యువరాజ్‌ సింగ్‌ సోదరుడు జోరావర్‌ సింగ్‌ భార్య ఆకాంక్ష గతంలో యువరాజ్‌ సింగ్‌ పైనే కాకుండా.. అతని కుటుంబంపై కేసు పెట్టింది. అయితే ఆ కేసులో ఏ మాత్రం నిజం లేకపోవడంతో లబ్ధి కోసమే అలా కేసు పెట్టినట్లు ఆకాంక్ష సింగ్‌ భార్య ఆకాంక్ష చెప్పిందని యువరాజ్‌ కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ కేసులో ఊరట లభించడంతో యువరాజ్‌ సింగ్ ఇకపై ప్రశాంతంగా ఉండగలదని వారు చెబుతున్నారు.

కాగా.. ఇటీవలే ఆకాంక్ష, జోరావర్‌ లు విడాకులు తీసుకున్నారు. గతంలో రెండేళ్ల క్రితం 2017 లో యువరాజ్‌ సింగ్‌ సోదరుడు జోరావర్‌ సింగ్‌ భార్య ఆకాంక్ష భర్తతో పాటు యువరాజ్‌ సింగ్‌, ఇంకా అతని తల్లి షబ్నామ్‌ సింగ్‌ లపై గృహ హింస కేసు నమోదు చేసింది. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని.. యువరాజ్‌పై పెట్టిన కేసును ఆకాంక్ష వెనక్కు తీసుకుందని యువీ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్న యువరాజ్‌ సింగ్ పేరును అడ్డం పెట్టుకుని తమని టార్గెట్ చేశారని.. యువీ ప్రతిష్టకు భంగం కల్గించాలని ఆకాంక్ష చూసిందని అన్నారు. అయితే ఆత్మస్థైర్యం కోల్పోయాక యువీ చట్టంపై నమ్మకంతో పోరాటం చేసాడని.. చివరికి యువీకి చివరి ఊరట దొరికిందని అన్నారు.