Wednesday, September 22, 2021

నడిరోడ్డుపై హెలికాప్టర్ ఆపి అడ్రస్ అడిగితే…!

ఉద్యోగ నియామకాల కోసం రక రకాల పరీక్షలు పెడుతుంటారు. కొన్ని ఉద్యోగాలకు వ్రాత పూర్వక పరీక్షలు పెడితే.. మరికొన్నింటికి శారీరక దారుఢ్య పరీక్షలు ఉంటాయి. ఇంకొందరికి ఆయా బాధ్యతలను బట్టి వాటికి సంబంధించి విషయల్లో పరీక్షలు పెడుతుంటారు. కానీ కజకిస్థాన్ రూటే వేరు. ఈ దేశం తమ ఆర్మీ సెలక్షన్స్‌లో భాగంగా పెట్టిన పరీక్ష ప్రజలను భయభ్రాంతులకు.. ఆపై ఆశ్చర్యానికి గురి చేసింది. విషయంలోకి వెళితే కజికిస్థాన్ తమ ఆర్మీలోకి నూతనంగా హెలికాప్టర్ పైలట్‌లను తీసుకోవాలని భావించింది. అందుకుగాను వారికి పరీక్షలు నిర్వహించింది.

ఇందులో భాగంగా ఓ పైలెట్‌కు ‘అక్తుబిన్సిక్’ నగరానికి చేరవలసిందిగా హెలికాఫ్టర్ ఇచ్చి పంపింది. సహజంగా హెలికాఫ్టర్‌లు, విమానాలు తాము చేరాల్సిన గమ్యానికి సంబంధించి ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)తో సంబంధాలు కలిగి ఉంటాయి. వాటి సూచనల మేరకే తమ తమ వాహనాలను నడపాల్సి ఉంటుంది. కానీ ఇది పరీక్ష కావడంతో వారికి కేవలం చేరాల్సిన ఊరు పేరు మాత్రమే చెప్పి పంపారు. ఇలా భయలు దేరిన ఓ పైలెట్‌కు అడ్రస్ అర్ధం కాలేదు.

వెంటనే తనకు దగ్గరగా కనిపిస్తున్న ఓ రహదారిపై హెలికాప్టర్‌ను దించేశాడు. అప్పటికే ఆ రోడ్డుపై లారీలు, కార్లు వెళుతున్నాయి. ఈ దృశ్యాన్ని చూసి ముందు వారు కంగారు పడ్డారట. ఆ తర్వాత ఆశ్చర్య పోయారు. బండి దిగిన పైలెట్ ఎదురుగా ఉన్న ట్రక్ డ్రైవర్‌ను అడ్రస్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం తన బండిని పైకి లేపుకుని వెళ్లిపోయాడట. నడిరోడ్డుపై హెలికాప్టర్.. అదీ ఆర్మీకి చెందిన ఎం0 భారీ హెలీకాప్టర్‌ను నడిరోడ్డుపై దింపడం సోషల్ మీడియాలో హల్‌చెల్ చేస్తోంది.

Latest Articles