అటునేనే… ఇటు నేనే… అంతటా నేనే… సర్వాంశభూతుణ్ణి నేనే అన్నట్టు ఉంటుంది వై.యస్. జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహారం. గతంలో ఒకసారి నందమూరి తారకరామారావు గారు నా చెప్పును నిలబెట్టినా గెలుస్తుంది అన్నారని విన్నాం. డైరెక్ట్ ఈ డైలాగ్ వాడకపోయినా జగన్ ప్రవర్తన అలాగే ఉంటుంది.
2019లో అధికారంలోకి రావటానికి ముందు తన కోసం, తనపార్టీని అధికారంలోకి తీసుకురావటానికి కష్టపడే అందరికీ కడుపులో పెట్టుకుని చూసుకుంటానని ఊదరగొట్టాడు. అధికారం అందగానే అందరికీ గాలికొదిలేసి రాజప్రసాదంలో చేరిపోయాడు.
జగన్ కోపానికి విజయసాయి, మిథున్‌రెడ్డి షాక్
అధికారం కోసం కేడర్‌కు, అభిమానులకే కాదు.. ప్రజలకు, వివిధ వర్గాలకు అనేక హామీలు ఇచ్చాడు. వాటిని కూడా మర్చిపోయి వ్యవహరిస్తున్నాడు. ఈ కారణంగానే అతి కొద్ది కాలంలోనే ప్రజావ్యతిరేకత పెంచుకున్నాడు.
చివరికి ప్రజల్లో తిరగాలంటే చుట్టూ పరదాలు, బారికేడ్లు లేనిదే కార్యక్రమాల్లోకి రాలేని పరిస్థితి. దీంతో ఆయన్ను అభిమానించి ఓట్లు వేసిన వివిధ వర్గాల ప్రజలు, వైసీపీ ద్వితీయశ్రేణి నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా జగన్ పాలనపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఈ అసంతృప్తుల్లోకి వచ్చి చేరారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. గత ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీ శారు. అప్పట్లో ఇదో సంచలనం. ఈ విషయంలో చాలాకాలంగా గుర్రుమీద ఉన్న దగ్గుబాటి నిన్న కారంచేడులో ప్రజలతో మాటా మంతీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ‘‘నేను గెలవకపోవడమే మంచిది అయింది. లేకపోతే కనీసం రోడ్లు కూడా వేయలేక మీతో తిట్లు తినాల్సి వచ్చేది. గెలిచి ఉంటే ఈ రోడ్లపై ఇంత స్వేచ్ఛగా తిరగగలిగేవాడిని కాదు.
ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మా అబ్బాయికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానిని జగన్ అన్నారు. కానీ దానికి ఆయన పెట్టిన షరతులు మాకు నచ్చలేదు.
అందుకే సున్నితంగా తిరస్కరించాం’’ అన్నారు. దీంతో ఆఖరికి దగ్గుబాటి కూడా జగన్ పాలనను ఛీ కొట్టారని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.