టాలీవుడ్లో ప్రముఖ నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దిల్ రాజు, గత రెండు దశాబ్దాల్లో ఎన్నో విజయవంతమైన సినిమాలను నిర్మించారు. అయితే, రాం చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన “గేమ్ చేంజర్” ఆయనకు ఊహించని షాక్ ఇచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంది. సంక్రాంతి పండుగ సందర్బంగా విడుదలైనప్పటికీ, సినిమా కమర్షియల్గా పెద్దగా విజయం సాధించలేకపోయింది. దిల్ రాజు ఈ సినిమాకు దాదాపు 450 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు సమాచారం. కానీ ఆశించిన ఫలితం రాకపోవడంతో భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు.
ఈ సినిమాతో ఎదురైన షాక్ కారణంగా ఇకపై పాన్ ఇండియా సినిమాల వైపు వెళ్లకూడదని దిల్ రాజు నిర్ణయించుకున్నట్లు సమాచారం. “గేమ్ చేంజర్” వలన నిర్మాతకు 120 నుంచి 150 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్టు టాక్. రాం చరణ్, ఈ నష్టాన్ని తీరుస్తూ మరో సినిమా చేయాలని సూచించినా, దిల్ రాజు ప్రస్తుతం ఆడ్వంచర్కి వెళ్లే ఉద్దేశ్యంలో లేరని తెలుస్తోంది. గతంలో చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలతో వరుస విజయాలను అందుకున్న దిల్ రాజు, ఈసారి పెద్ద బడ్జెట్ సినిమాతో భారీ నష్టాన్ని చవిచూశారు.
ప్రస్తుతం దిల్ రాజు తన కెరీర్ను పునరాలోచించుకుంటున్నారు. ఆయన బ్యానర్ విజయవంతమైన చిన్న, మధ్యస్థాయి సినిమాలే గుర్తింపు తీసుకొచ్చాయి. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుంటూ, వాటిని నిర్మించడం వల్ల ఆయనకు పెద్దగా నష్టాలు ఉండేవి కావు. కానీ “గేమ్ చేంజర్” విషయంలో ఆయన చేసిన లెక్కలు తప్పిపోయాయి. రాం చరణ్, శంకర్ కాంబినేషన్ అంటే భారీ హిట్ ఖాయమని అనుకున్నారు. కానీ ప్రేక్షకుల నుండి అంచనాలకు తగ్గ స్పందన రాకపోవడంతో సినిమా కలెక్షన్లు ఆశించిన స్థాయికి చేరలేదు. సంక్రాంతికి వెంకటేష్ నటించిన “సంక్రాంతికి వస్తున్నాం” చిత్రం కొంత వరకు నష్టాన్ని తగ్గించినప్పటికీ, “గేమ్ చేంజర్” వల్ల పెద్ద మొత్తంలో నష్టం వచ్చినట్లు సమాచారం.
ఈ అనుభవంతో ఇకపై పెద్ద బడ్జెట్ సినిమాలు నిర్మించకూడదని దిల్ రాజు నిర్ణయించుకున్నట్లు టాక్. స్టార్ హీరోలతో వందల కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా చేయడం కంటే, తక్కువ బడ్జెట్లో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేయడమే సురక్షితమని భావిస్తున్నారు. పెద్ద రిస్క్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు, తిరిగి రికవర్ చేయడానికి చాలా సమయం పడుతుంది. అందుకే ఆయన భవిష్యత్తులో తక్కువ రిస్క్ తీసుకునే విధంగా తన నిర్ణయాలను మార్చుకుంటున్నారు. “గేమ్ చేంజర్” ఇచ్చిన అనుభవంతో దిల్ రాజు ఇకపై తన సినిమాల విషయంలో మరింత జాగ్రత్తగా ముందుకెళ్లాలని డిసైడ్ అయ్యారు.