రికార్డు ధర పలికిన మోడీ సూట్.. మరి ఇప్పుడు

0
308

భారత ప్రధాని నరేంద్ర మోడీ తాను పలు సందర్భాలలో అందుకున్న బహుమతులను వేలానికి పెడుతున్నారు. ఈ నెల 14 నుండి వేలం పాత ప్రారంభం కానుంది. ప్రధాని హోదాలో వివిధ దేశాలలో మోడీ పర్యటించినప్పుడు ఆ దేశాల ప్రతినిధులు ఇచ్చిన గిఫ్ట్ లను ఈ వేళలో ఉంచుతున్నారు. ఈ వేలం పాట ధ్వారా వచ్చే డబ్బును గంగానది ప్రక్షాలకు ఉపయోగించనున్నారు. ఈ వేలంలో అతి తక్కువగా ప్రారంభం అయిన ధర రెండు వందల రూపాయలు అయితే.. అత్యధిక ధర రెండున్నర లక్షలు గా ఉంది. గత ఆరు నెలలుగా మోడీకి వచ్చిన బహుమతులను నేషన్ గ్యాలెరీ అఫ్ మోడరన్ ఆర్ట్ లో ఉంచారు. ఈ ఆరు నెలల్లో మోడీ అందుకున్న గిఫ్ట్ ల సంఖ్య 2,722. ఈ మొత్తం బహుమతులను వేలం వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

వేలానికి పెట్టనున్న వాటిలో ప్రధాని మోడీ చిత్ర పటం.. చిత్ర కళా వస్తువులు, శాలువాలు, తల పాగాలు, దేవుళ్ళ చిత్ర పటాలు, విగ్రహాలుగా ఉన్నాయి. దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు.. పొరుగు దేశాలకు చెందిన ప్రతినిధులు ప్రధాని మోడీకి ఇచ్చిన గిఫ్ట్ లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో మోడీ అందుకున్న 1800 వందల గిఫ్ట్ లను ఆన్లైన్ ధ్వారా వేలం పాట పెట్టారు. వారం రోజుల పాటు ఈ వేలం పాట సాగింది. ఈ వేలం పాట ధ్వారా వచ్చే డబ్బును గంగానది ప్రక్షాలకు ఉపయోగించనున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తెలిపారు. గతంలో మోడీ వేసుకున్న ఓ సూటు 4 కోట్ల 31 లక్షల రూపాయలకు అమ్ముడు పోయింది.