Wednesday, September 22, 2021

బెంగుళూరులో తెలుగు అమ్మాయిపై దారుణం

కర్ణాటకలో ఇటీవల జరిగిన ఎంబీఏ విద్యార్థిని పై జరిగిన దారుణం మరువక ముందే మరో అత్యాచార ఘటన చోటు చేసుకుంది. బెంగుళూరులో ఓ సాఫ్ట్ వెర్ కంపెనీలో పని చేస్తున్న తెలుగు మహిళా ఉద్యోగిపై ఇద్దరు నైజీరియన్లు దారుణానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరు ఆమె స్నేహితుడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. మొదట సోషల్ మీడియా ధ్వారా వీరు స్నేహితులుగా మారారు. ఈ క్రమంలో మంగళవారం ఆ యువతి సదరు నైజీరియన్ల ఇంటికి వెళ్ళింది.

అక్కడ ఆమె శీతల పానీయం తాగగా, ఆ తరువాత స్పృహ కోల్పోయింది. ఆపై ఆ ఇద్దరు నైజీరియన్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్లు ఆమె గ్రహించింది. మరుసటి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest Articles