క్రియేటివ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన లో తెరకెక్కుతున్న చిత్రం ‘హను-మాన్’. హీరోగా తేజ సజ్జ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. హనుమంతుడి పాత్ర ఆధారంగా ఈ ఫిక్షనల్ మూవీకి తెరెక్కిస్తున్నారు. త్వరలో ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్..
ఈ సినిమాకు సంబంధించి ప్రమోషనల్ కంటెంట్ పై ప్రేక్షకులు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి ట్రెండు క్రియేట్ చేసింది. ఇందులో వాడిన నాణ్యమైన వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ అందరినీ ఆకట్టుకుంది. సినీ అభిమానులే కాకుండా ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా హనుమాన్ టీజర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
బ్యాగ్రౌండ్ స్కోర్ ను సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు అందించారు. చిత్ర బృందాన్ని ఇటీవల మంత్రి కిషన్ రెడ్డి అభినందించారు.
కిషన్ రెడ్డి ప్రశంస
ఇటీవల రాజకీయ నాయకులు కూడా సినిమాలపై విభిన్నరీతిలో స్పందిస్తున్నారు. రీసెంట్ గా ‘హను-మాన్’ టీజర్ చూసిన కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి చిత్ర యూనిట్‌ను ప్రత్యేకంగా కలిసి అభినందించారు. టీజర్ లో క్రియేటివిటి కనిపిస్తుందని, వీఎఫ్ఎక్స్, విజువల్స్ బాగున్నాయని అభినందనల వర్షం కురిపించారు.
సినిమా బాగుంటే కంటెంట్ నచ్చితే వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాజకీయ నేతలు కూడా ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో చిత్రాలు విజయం సాధించడానికి ఇది కూడా దోహదం చేస్తుందనే చెప్పాలి. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ ‘కార్తికేయ-2’ తదిత చిత్రాలకు బీజేపీ నాయకులు బాగా మద్దతిచ్చారు. వీరి మద్దతుకు తోడు మంచి కంటెంట్ ఉండడంతో అవి బాక్స్ ఆఫీస్ హిట్లను సొంతం చేసుకొని వసూళ్ల వర్షం కురిపించాయి.
రెండు మూవీస్ పోలుస్తున్న అభిమానులు
రామాయణ గాధను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు బాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ఓం రౌత్ ‘ఆది పురుష్’ తీశాడు. దీనికి సంబంధించిన ట్రైలర్ దసరా సీజన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
ఇందులోని ప్రధాన పాత్రలైన హనుమాన్, తదితర పాత్రల విషయంలో జాగ్రత్తలు తీసుకోలేదని పాన్ ఇండియా లెవెల్ లో వచ్చే చిత్రాన్ని ఇంత నిర్లక్ష్యంగా తీశారంటూ నెటిజన్ల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బీజేపీ నాయకులు కూడా దీని మేకింగ్ పై విరుచుకుపడ్డారు. ‘ఆది పురుష్’కు బీజేపీ అండగా ఉంటుందని అనుకున్న చిత్ర యూనిట్ కు నిరాశే మిగిలింది.
రామాయణ ఇతిహాస గాధలు ఇలా చేశారంటూ ట్రైలర్ ఆకట్టుకోలేదంటూ చిత్ర యూనిట్‌పై సీరియస్ అయ్యారు. దీంతో యూనిట్ సభ్యులు మూవీ రిలీజ్ మరో ఐదు నెలలు పోస్ట్ పోన్ చేసి మెరుగైన అవుట్ ఫుట్ అందించేందుకు వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్‌పై రివర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
విజయంపై ధీమా..
ఇక ‘హను-మాన్’ చిత్రానికి సంబంధించి కంటెంట్ పరంగా విజయం సాధిస్తే బాక్సాఫీస్ రికార్డులను తప్పకుండా కొల్లగొడుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. తేజ సరసన అమృత ఇయర్ హీరోయిన్ గా చేస్తున్నారు. ముఖ్యపాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్, దీపక్ శెట్టి, వినయ్ రాజ్, నటిస్తున్నారు. ‘ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్’ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మేకర్స్ విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ‘ఆది పురుష్’ కంటే ముందే ఈ మూవీ థియేటికల్ రిలీజై ఎంటర్టైన్ చేయనుంది.