టాలీవుడ్ ఎనీ ఇండస్ట్రీలో అందరివాడిగా అల్లు అర్జున్ కి మంచి గుర్తింపు ఉంది.. ఎటువంటి కాంట్రవర్సీలు లేకుండా ప్రతి ఒక్కరితో స్నేహపూరితంగా ఉండే సెలబ్రిటీలలో అల్లు అర్జున్ పేరు ప్రప్రదంగా ఉంటుంది. అందరితో మంచిగా ఉందాం అని అనుకునే బన్నీ కు ఆచరణలోకి వచ్చేసరికి ఎక్కడ పొరపాటు జరిగిందో ఏమో కానీ కొంతమంది అనుకోకుండా దూరమయ్యారు.
తెలిసి జరుగుతోందో లేక తెలియక జరుగుతుందో మనకైతే తెలియదు.. మొత్తానికి తన అనుకున్న వాళ్ళని బన్నీ దూరం చేసుకున్నాడు.అయితే ఇందులో బన్నీ తప్పు ఏమీ లేకపోవడం విశేషం. బన్నీ అంటే ఎంతో ఇష్టపడే ఇద్దరు సెలబ్రిటీలు అతనికి దూరం కావడం నిజంగా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బన్నీతో ఎప్పటినుంచో మంచి రిలేషన్షిప్ మైంటైన్ చేస్తూ వచ్చిన ఆ ఇద్దరు సడన్‌గా ఎందుకు దూరమయ్యారో తెలుసుకుందాం..
దేవిశ్రీప్రసాద్, డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్.. ఈ ఇద్దరు అల్లు అర్జున్ కు ఎంతో క్లోజ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. బన్నీ జానీ మాస్టర్ కోసం ఎన్నో చాన్సులు ఇచ్చాడు.. ఒకరకంగా అతన్ని స్టార్‌ని చేశాడు. ఇక దేవి శ్రీ ప్రసాద్ ని అలా కదిపితే చాలు ఎప్పుడు బన్నీ గురించే మాట్లాడేవాడు. అలాంటిది ఈ ఇద్దరు ఇప్పుడు అతనికి దూరమయ్యారు.
జానీ మాస్టర్ కు సంబంధించిన గొడవ మొత్తం పుష్ప 2 సెట్ లోనే జరిగింది అని ఫిలింనగర్ లో టాక్. అయితే చిత్రబృందం మాత్రం జానీ మాస్టర్ విషయంలో తమకు తమ హీరోకి ఎటువంటి సంబంధం లేదు అని తేల్చి చెప్పింది. ఇక పుష్ప 2 మ్యూజిక్ విషయంలో నిర్మాతలు అసంతృప్తి వ్యక్తం చేయడం.. దేవిశ్రీప్రసాద్ స్థానాన్ని ఇతర సంగీత దర్శకులకు అప్పగించడం.. లాంటివి అతనికి మనస్థాపాన్ని కలిగించాయి. ఫస్ట్ మూవీ త్రివిక్రమ్ తో కాబట్టి అందులో దేవి శ్రీ ప్రసాద్ ఉండడం చాలా కష్టమే.ఇక దీంతో బన్నీ సినిమాలకు దేవి దూరమైనట్టే లెక్క. అయితే ఇదంతా కేవలం సినిమాల వరకే పరిమితం.. పర్సనల్ గా ఆఫ్ స్క్రీన్ వాళ్ళ స్నేహం అలాగే ఉంటుంది అని అందరూ భావిస్తున్నారు.