ఇంటి నుంచి మొదలు కొని రెస్టారెంట్ల వరకూ స్పైసీ ఫుడ్ కు ఎక్కువగా అలవాటు పడుతున్నారు భోజన ప్రియులు. ఇది చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏదైనా మితం వరకూ వినియోగిస్తే ఆరోగ్యమే కానీ మితి మీరితే మాత్రం చేటని హెచ్చరిస్తున్నారు. కూరల్లో టేస్టీ కోసం ఒకప్పుడు ఎక్కువగా మిరియాలు వాడేవారు. కానీ వాటి స్థానంలో ప్రస్తుతం రెడ్ మిర్చీ వచ్చి చేరింది.
మిర్చీని పట్టించి కారంపొడిగా మార్చి కొంచెం ఉప్పుకలిపి నిల్వ ఉంచుకుంటే ఇది కూరలు, స్పైసీ ఫుడ్ లోకి పని చేస్తుంది.
కానీ దీని వాడం ప్రస్తుతం ఎక్కువ మొత్తంలో కొనసాగుతుంది. అధిక కారం వినియోగిస్తే కలిగే నష్టాల గురించి ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఎక్కువ వినియోగిస్తే కలిగే నష్టాలు
రెడ్ చిల్లీ పౌడర్ ఏ వంటకానికైనా అదనపు రుచిని జోడిస్తుంది. చాలా రకాల వంటకాల్లో దీన్ని ఉపయోగిస్తుంటారు. కానీ దీని వాడకం ఎక్కువైతే ఉదరంతో పాటు చాలా అవయవాలపై ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది పరిమితికి దాటితే డయేరియాకు దారి తీస్తుందని చెప్తున్నారు. ఎర్రమిరప కారంలో ఉండే చిన్న చిన్న కారం రేణువులు పొట్టలోపలి భాగంగా అతుక్కొని ఉండి చేటు చేస్తాయి. పేగులకు కూడా కీడు చేయడంతో పాటు పుండ్లును ఏర్పరుస్తాయి.
ఎసిడీటీ
సాధారణంగా కారం ఎసిడిటీకి దారి తీస్తుంది. మోతాదు అయితే పరవాలేదు. కానీ ఎక్కువగా వినియోగిస్తే మాత్రం చేటని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. తరుచుగా గుండెలో మంటగా ఉండడం. బాగా తేన్పులు రావడం.
వంటి సమస్యలు ఏర్పడుతాయి. ఇలాంటి సమస్యలు కనుక ఉంటే వెంటనే కారం వినియోగం తగ్గించడమే మంచిది.
దీంతో పాటు నీరసం, మూర్చ, కడుపులో నొప్పి, వికారం, వాంతులు వంటివి వ్యాపిస్తాయి. వీటితో పాటు కారంపొడి ఎక్కువ వాడితే నోటిపూత కూడా ఏర్పడుతుంది.
కడుపులో పుండు
సాధారణంగా వైద్యులు కూడా రెడ్ మిర్చీని మోతాదుకు మించి వాడద్దని సూచనలు చేస్తూనే ఉంటారు. కానీ భోజన ప్రియులు మాత్రం వాటిని పట్టించుకోరు. దీంతో జీర్ణాశయంలో కూడా విపరీతమైన సమస్యలు ఏర్పడుతాయి.
ఎక్కువ కారం తీసుకుంటే జీర్ణ వ్యవస్థ గోడల్లో పుండ్లు తయారవుతాయి. ఆ తర్వాత ఎలాంటి ఆహారం తీసుకున్న సమస్యలే వస్తాయి.
కారంపొడిలోని కణాలు జీర్ణాశయంతో పాటు చిన్నపేగు, పెద్దపేగులకు చాలా చేటు చేస్తుంది. అల్సర్ కు దారి తీస్తుంది. గర్భాధారణ సమయంలో ఎక్కువగా రెడ్ చిల్లీ పౌడర్ వినియోగిస్తే గర్భస్థ శిశువుకు శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాధం ఎక్కువగా ఉంటుంది.
వీటితో పాటు కారం పొడి వాడితే శరీరకంగా చాలా రకాల సమస్యలు వస్తాయి. కనుక వీలైనంత వరకూ తక్కువ మోతాదులో వాడుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులతో పాటు న్యూట్రీషియన్లు కూడా సూచిస్తున్నారు.