సెంటిమెంట్‌కు కేరాఫ్ అడ్రస్ టాలీవుడ్. ఇక్కడ సెంటిమెంట్‌ను నమ్మినంతగా తమను తాము కూడా నమ్ముకోరు. ప్రాజెక్ట్ స్టార్ట్ దగ్గర నుంచీ కాస్టింగ్‌తో పాటు అన్ని విషయాల్లోనూ సెంటిమెంట్ తోక పట్టుకునే పయనిస్తారు టాలీవుడ్ జనాలు. కొందరు ఆర్టిస్ట్‌లు సినిమాలో ఉంటే ఆ సినిమా సూపర్‌హిట్ అనే సెంటిమెంట్ ఎలా ఉంటుందో.. మరికొందరు సినిమాలో ఉంటే అది బాల్చీ తన్నేస్తుంది అనే నెగెటివ్ సెంటిమెంట్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. తాజాగా రవితేజ నటిస్తున్న ‘ఖిలాడి’ని ఇలాంటి ఓ నెగెటివ్ సెంటిమెంట్ పట్టి పీడిస్తోంది.
ఇటీవల విడుదలైన రవితేజ ‘క్రాక్’ సినిమా హిట్ టాక్ స్వంతం చేసుకోవడంతో చాలాకాలం తర్వాత రవితేజ హిట్‌ను చూసినట్టు అయింది. ఈ సంతోషంలోనే రమేష్‌వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ మొదలు పెట్టాడు రవితేజ. ఈ సినిమాలో భారీ తారాగణాన్ని ఎంచుకున్నాడు దర్శకుడు రమేష్‌వర్మ. గతంలో రవితేజకు ‘వీరా’ వంటి ఫ్లాప్‌ను ఇచ్చింది ఈ రమేష్ వర్మే. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డిoపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తుండగా, సీనియర్ అర్జున్ కీలక పాత్రను పోషిస్తున్నారు.
అర్జున్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన తర్వాత తెలుగులో చేసిన సినిమాలు ‘శ్రీ ఆంజనేయం, లై, నాపేరు సూర్య, హరేరామ హరేకృష్ణ వంటివి డిజాస్టర్ లుగానే మిగిలాయి. ఇప్పుడు మళ్లీ రవితేజ కాంబినేషన్లో చేస్తుండడంతో ఈ నెగెటివ్ సెంటిమెంట్‌పై ఫిల్మ్‌నగర్‌లో రకరకాల గుసగుసు వినిపిస్తున్నాయి. అసలే ప్లాప్‌లతో పోరాటం చేసి హిట్టు దక్కించుకున్న రవితేజ తనకు ‘వీరా’ వంటి డిజాస్టర్‌ను ఇచ్చిన దర్శకుడు రమేష్‌వర్మకు అవకాశం ఇవ్వడమే నెగెటివ్‌గా అనిపిస్తుంటుంటే.. ఇప్పుడు అర్జున్ సెంటిమెంట్ కూడా తోడవడంతో ‘ఖిలాడి’ని ముంచినా.. తేల్చినా అర్జున్‌దే భారం అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.