తన ఘాటైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వివాదాల్లో ఉండే నటుడు శివాజీ.. మరో సారి వార్తల్లో నిలిచాడు. తాజాగా ‘దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ వేడుకకి ముందు యాంకర్ చీర కట్టుకు రావడంతో.. ముందుగా ఆమెని ప్రశంసించి అనంతరం హీరోయిన్ల డ్రెస్సింగ్ సెన్స్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
హీరోయిన్ల అందం చీరలోనే, నిండుగా కప్పుకొనే బట్టల్లోనే ఉంటుందని శివాజీ అన్నారు. అంతటితో ఆగకుండా సామాన్లు కనపడే బట్టల్లో ఏమి ఉండదని డబల్ మీనింగ్ వ్యాఖ్యలు చేశారు. అలాంటి బట్టలు వేసుకున్నంత మాత్రాన.. చాలా మంది నవ్వుతూ అంటారు గానీ.. ‘దరిద్రపు ముం.. ‘ కాస్తా మంచి బట్టలు వేసుకోవచ్చుగా అని మనసులో అనుకుంటారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అయితే తన వ్యాఖ్యలు మళ్ళీ కప్పిపుచ్చుకుంటూ.. స్త్రీ అంటే ఎంత అందంగా ఉంటే, అంత గౌరవం పెరిగిద్దని అన్నారు. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలని, స్వేచ్చని కోల్పోవద్దని హీరోయిన్ లకి హితవు పలికారు. మన వేషభాషల్లోనే గౌరవం పెరుగుతుందని, చీర కట్టుకున్న వాళ్ళకే విశ్వసుందరి కిరీటాలు వచ్చాయి చెప్పారు.
ఇదిలా ఉండగా.. శివాజీ ఉపయోగించిన భాషపై నెటిజన్లు, మహిళలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా మరి కొంతమంది మాత్రం శివాజీ వ్యాఖ్యల్లో తప్పులేదని, భాష ఘాటుగా ఉన్నా శివాజీ నిజమే చెప్పాడని చెబుతున్నారు. ఏమైనా ‘సామాన్లు, దరిద్రపు ముం..” అంటూ నీచమైన భాష మాట్లాడినందుకు పలువురు సెలబ్రిటీలు కూడా పెదవి విరుస్తున్నారు.

