ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్లో భారీ డిమాండ్ ఉన్న భామ రష్మిక మందన. పుష్ప మూవీతో వరల్డ్ వైడ్ క్రేజ్ సంపాదించిన ఈ బ్యూటీ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ‘యానిమల్’చిత్రంతో మరింత క్రేజ్ సంపాదించుకుంది. ఆ మూవీ 900 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టడం.. ఇక ఇప్పుడు తాజాగా వచ్చిన పుష్ప 2 మూవీ విడుదలైన ఆరు రోజుల్లోనే ఏకంగా వేయికోట్ల క్లబ్ లోకి చేరడం ఈ భామకు బాగా కలిసి వస్తున్నాయి.
లాంగ్ లాంగ్ లో ఈ చిత్రం 1500 కోట్ల వరకు వసూలు చేస్తుంది అని ట్రేడ్ పండితుల అంచనా. ఇక ఈ మూవీలోకి సీక్వెల్ గా వచ్చే నెక్స్ట్ మూవీస్ తో పాటు హిందీలో చావా లాంటి సాలిడ్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. అందరినీ తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో పాటు అద్భుతమైన నటనతో ఫిదా చేస్తున్న రష్మికకు ఆఫర్ల కొదవలేదు.
ప్రస్తుతం రష్మిక స్టార్ హీరోల ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయింది అనడంలో డౌట్ లేదు.ఇక దీంతో ఆమె రెమ్యూనరేషన్ కూడా అమాంతం పెరిగిపోతోంది అని అందరూ భావిస్తున్నారు. ఇక రష్మిక త్వరలో రణబీర్ కపూర్ తో కలసి ‘యానిమల్’ కి సీక్వెల్ గా తెరకెక్కనున్న ‘యానిమల్ పార్క్’ మూవీలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మొదటి సినిమాతో పోల్చుకుంటే ఇది మరింత అడ్వాన్స్డ్ వర్షన్ గా ఉంటుంది అని సందీప్ రెడ్డి ఓపక్క హింట్ ఇవ్వనే ఇచ్చారు.
ఈ చిత్రం ఏకంగా 2000 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకోవడం గ్యారెంటీ అంటున్నారు త్రెడ్ పండితులు. దీంతో రష్మిక ఖాతాలో మరో అరుదైన రికార్డ్ రావడం కన్ఫామ్. స్టార్ హీరోల సినిమాలకే వెయ్యి కోట్లు, 2000 కోట్లు.. అంటూ టార్గెట్లు ఉంటున్న ఈ టైం లో వరుసగా వేలకోట్లు అకౌంట్లో వేసుకునే సినిమాలలో హీరోయిన్గా నటిస్తూ రష్మిక దూసుకుపోతోంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు క్రేజ్ ఉన్నప్పుడే బాగా వసూళ్లు చేసుకోవాలి అని భావిస్తున్న ఈ భామ రెమ్యూనరేషన్ అంతకంత పెంచుతున్నట్లు తెలుస్తోంది.