అల్లు అర్జున్, రష్మిక మందన్న కాంబోలో డిసెంబర్ 5న విడుదల కాబోతున్న పుష్ప చిత్రం పై సోషల్ మీడియాలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. నిజానికి ఈ చిత్రానికి సంబంధించిన తొలి కాపీ నవంబర్ 20 కల్లా సిద్ధం కావాలి అన్న టార్గెట్ నిర్మాతలు పెట్టుకున్నారు. కానీ ఇంకా చిత్రానికి సంబంధించిన షూటింగ్ పెండింగ్ ఉండడంతో అది సాధ్యపడలేదు. మొదటినుంచి షూటింగ్ విషయంలో బాగా డిలే అవుతూ వచ్చిన పుష్ప డిసెంబర్ 5 విడుదల విషయంలో కూడా ఎంతో కన్ఫ్యూజ్ అన్ని సృష్టించింది.
అయితే ఎట్టకేలకు షూటింగ్ పనులు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇక ప్రమోషన్స్ కి చిత్ర బృందం శ్రీకారం చుట్టారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ కోసం కూడా భారీగా ప్రమోషన్స్ చేశారు. మూవీ విడుదల సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ఫుల్ ఫోకస్ మూవీ ప్రమోషన్స్ పై పెడుతున్నారు అని టాక్.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న సుకుమార్ చిత్రం విడుదల అయ్యేటంతవరకు మీడియా ముందుకు వచ్చే అవకాశం లేనేలేదు. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ని ముందుకు తీసుకు వెళ్లాల్సిన బాధ్యత హీరో అల్లు అర్జున్ పై ఉంది. ఈ మూవీకి సంబంధించిన ఈవెంట్ కొచ్చిలో ప్లాన్ చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది. అనంతరం మరొక ఈవెంట్ ను బెంగళూరు, ఇంకో ఈవెంట్ ని ముంబైలో నిర్వహించడానికి చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తున్నారు.
దేవర త్రీ రిలీజ్ ఫంక్షన్ సమయంలో జరిగిన సంఘటన ప్రభావంతో ఈసారి జాగ్రత్తలు పకడ్బందీగా తీసుకుంటున్నారు. మరోపక్క సోషల్ మీడియాలో కూడా ప్రమోషన్స్ భారీగా నిర్వహిస్తున్నారు. అల్లు అర్జున్ గతంలో లేనట్టు ఈసారి మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చే అవకాశం ఉంది అని అందరూ భావిస్తున్నారు.
సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్ ఖర్చు కూడా భారీగానే ఉండే అవకాశం ఉంది. పుష్ప చిత్రంతో ఐకాన్ స్టార్ గా మారి రికార్డులు బద్దలు కొట్టిన బన్నీ ఈసారి పుష్ప 2 తో ఎటువంటి రికార్డులు బ్రేక్ చేస్తాడు అన్న విషయం పై సర్వత్రా ఆసక్తిగా నెలకొంది.