వాహనదారులకు శుభవార్త.. ఇకపై జరిమానాలు ఉండవు..!

0
2096

గత కొంతకాలంగా పోలీసులు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. భారీగా జరిమానాలు వేస్తూ.. ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. అయితే.. ఇక జరిమానాలు ఉండవా? అంటే అవుననే చెబుతున్నారు పోలీసులు. భారీ జరిమానాలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో పోలీసులు ఒక విన్నూత ఆలోచనకు తెర తీశారు. అదేమిటంటే.. హెల్మెట్ లేకపోతే కొత్త నిబంధనలు చెప్పి.. అప్పటికప్పుడు వాహనదారుడిచేత హెల్మెట్ కొనిస్తున్నారు. అలానే.. లైసెన్స్ లేకుంటే వెంటనే ఎల్ఎల్ఆర్ స్లాట్ బుక్ చేయిస్తున్నారు. దీనితో వాహన దారుడు తప్పనిసరిగా వెళ్లి లెర్నింగ్ లైసెన్స్ తీసుకుని.. సదరు కాపీ అధికారులకు చూపిస్తే జరిమానాను రద్దు చేస్తారు.

వాటితో పాటు ఇన్స్యూరెన్స్ లేకపోయినా.. పొల్యూషన్ సర్టిఫికెట్ లేకున్నా.. అక్కడికక్కడే వాటిని వాహన దారుడిచేత కొనిపిస్తున్నారు. పొల్యూషన్ చెక్ చేసేందుకు వాహనాన్ని అక్కడే పోలీసులు సిద్ధంగా ఉంచుకుంటున్నారు. పట్టుబడిన బండికి ఏమైతే కాగితాలు లేవో.. సదరు కాగితాలు అన్నీ వాహన దారుడికి ఇప్పించేలా చేస్తున్నారు. రాచకొండ పోలీసులు మొదలు పెట్టిన ఈ పద్దతిని హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా మొదలు పెట్టనున్నట్లు చెబుతున్నారు పోలీసులు. ఏది ఏమైనా భారీ జరిమానాలతో పోలిస్తే.. ఇది మంచిదే అని వాహనదారులు చెబుతున్నారు.