Saturday, July 24, 2021

కోటిన్నర ఇచ్చి పరాయి మొగుడిని కొనుక్కున్న ప్రియురాలు

అవును.. సినిమాకు సంబందించిన కథలు కూడా ఒక్కోసారి నిజ జీవితంలో జరుగుతూ ఉంటాయి. కొన్ని నిజజీవిత ఘటనలు సినిమాగా తెరకెక్కిస్తారు. దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి తెరకెక్కించిన ‘శుభలగ్నం’ సినిమా కథ ఇప్పుడు మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ లో వెలుగులోకి వచ్చింది. తన భర్తని కోటిన్నర కి మరో మహిళకు అమ్మేసింది ఓ భార్య. ఆ వివరాలలోకి వెళితే.. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ లో ఓ భర్త తన భార్యని, పిల్లలను పట్టించుకోవడం మానేసి ఆఫీస్ లో తన తో పని చేస్తున్న మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీనితో ఆ భార్య అతడి ప్రియురాలి నుండి తన భర్త కావాలంటే కోటిన్నర డిమాండ్ చేసింది.

ఈ భార్య భర్తలకు ఇద్దరు ఆడ పిల్లలు. వాళ్ళు కూడా తమకు ఈ గొడవల వలన చదువుపై శ్రద్ద పెట్టలేకపోతున్నట్లు కోర్ట్ కి తెలిపారు. పిల్లల ఫిర్యాదు మేరకు సదరు భార్య భర్తలను కౌన్సిలింగ్ కి పిలిపించగా.. తనకు భార్య పిల్లలు వద్దని, తన ప్రియురాలితోనే ఉంటానని భర్త సెలవు ఇచ్చాడు. దీనికి సదరు భార్య కోటిన్నర ఇస్తే తన భర్తని తీసుకెళ్లవచ్చని చెప్పింది. ఈ డీల్ కి ప్రియురాలు కూడా ఒప్పుకుంది. ఓ ఖరీదైన బంగ్లా, 27 లక్షల నగదు ఆమెకు ఇచ్చింది ప్రియురాలు. అయితే ఈ డబ్బు తన కోసం కాదని తన పిల్లల భవిష్యత్తు కోసమని సదరు భార్య చెబుతుంది. పట్టించుకోని భర్త కన్నా తనకు ఇలానే మంచిదని భావిస్తున్నట్లు తెలిపింది. అయితే కోటిన్నర ఇచ్చి పరాయి మొగుడిని కొనుక్కున్న ప్రియురాలు గురించి సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Latest Articles