ఉన్నది లేనట్టుగా,లేనిది ఉన్నట్టుగా చూపించడం లో ఎల్లో మీడియా ని మించింది మరొకటి లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. వీళ్ళు ప్రచారం చేసే కథనాలను చూసి ఇదే నిజమేమో అని నమ్మే జనాలు కోట్లలో ఉంటారు.
కానీ అది నిజం మాత్రం కాదు, ఇలాంటి కనికట్టు విద్య చెయ్యడం లో చంద్రబాబు సంబంధించిన ఎల్లో మీడియా కి కొట్టినపిండి లాంటిది. చంద్రబాబు కి ప్రత్యేకంగా సలహాదారులు అవసరం లేదు. అతనికి అండగా ఉండే ఎల్లో మీడియా ఉండగా ఏ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అవసరం కూడా లేదు.
ఆఖరికి దగ్గుబాటి కూడా ఛీ అన్నాడు…
కానీ ఎల్లో మీడియా ఇచ్చే ముసలి ముతక సలహాలు చంద్రబాబు కి ఈమధ్య నచ్చడం లేదేమో, అందుకే ప్రశాంత్ కిషోర్ ని తెచ్చి పెట్టుకున్నాడు. ఇతని ఎంట్రీ తో పాపం ఎల్లో మీడియా కి కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఎందుకంటే ఇక నుండి చంద్రబాబు నుండి తమకి ఫండ్స్ ఎక్కడ అందవేమో అని వాళ్ళ భయం .
కేవలం ప్రశాంత్ కిషోర్ కోసం చంద్రబాబు మూడు నెలలకు 100 కోట్ల రూపాయిలను ఖర్చు చేసాడట. ఇది ఎల్లో మీడియా ఓనర్స్ కి మింగుడు పడడం లేదు. ఇక నుండి తమకి పని ఉండదేమో అని వాళ్ళు దిగాలు చెందిపోతున్నారు.
వెన్నుపోటు తత్త్వం ఉండే చంద్రబాబు తమకి కూడా వెన్నుపోటు పొడిచాడని తెగ ఫీల్ అయిపోతున్నారట. 2024 లో ఒకవేళ టీడీపీ – జనసేన పార్టీ అధికారం లోకి వస్తే టోటల్ క్రెడిట్ మొత్తం ప్రశాంత్ కిషోర్ కి వెళ్ళిపోతుందని ఎల్లో మీడియా వాపోతున్నారట.
అయితే మీడియా తో పెట్టుకుంటే డేంజర్ అని చంద్రబాబు కి మాత్రం ఎందుకు తెలియకుండా ఉంటుంది ?, అతనికి సంబంధించిన రహస్యాలు మొత్తం వాళ్ళ గుప్పిట్లో ఉంటాయి.
ఒకవేళ సీఎం సీట్ నుండి దించేయాలంటే వాళ్లకు క్షణం పని, కాబట్టి చంద్రబాబు నాయుడు ఎప్పటికీ ఎల్లో మీడియా ని దూరం పెట్టడు, ఎల్లో మీడియా ఆయనకి ఆరోప్రాణమా లాంటిది అని మరికొంతమంది అభిప్రాయ పడుతున్నారు.
ఇకపోతే టీడీపీ – జనసేన కి సంబంధించిన ఉమ్మడి మ్యానిఫెస్టో వచ్చే ఏడాది సంకాంతి కి విడుదల చెయ్యబోతున్నారు. ఇప్పటి వరకు ఎవ్వరూ అమలు చేయనటువంటి పథకాలను ఈ మ్యానిఫెస్టో లో పొందుపర్చబోతున్నారట.
ఇది జనాల్లోకి వెళ్తే టీడీపీ – జనసేన కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని అంటున్నారు, చూడాలి మరి.