ప్రస్తుతం దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ అరెస్టు అయ్యాడు అన్న వార్త సంచలనంగా మారింది. ఇప్పటికే అల్లు అర్జున్.. మెగా అభిమానులు మధ్య జరిగే సైలెంట్ వారి గురించి అందరికీ తెలిసిందే. అయితే సరిగ్గా అతను అరెస్టు అయ్యే టైంకి పవన్ కళ్యాణ్ పెట్టిన ఒక ట్వీట్ ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య డిస్క్యూట్స్ని హైలైట్ చేస్తూ మరింత హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటికే అల్లు – మెగా గొడవలపై ఎప్పటినుంచో వస్తున్న వార్తలకు ఈ ట్వీట్ మరింత సెగ పుట్టిస్తోంది. ఇప్పటికే మెగా కాంపౌండ్ హీరోలైన సాయి ధరం తేజ్, వరుణ్ తేజ్ అంతర్గతంగా ఉన్న తమ కోపాన్ని ఏదో ఒక రూపంలో ప్రదర్శించారు. మరోపక్క పుష్ప 2 మూవీ రిలీజ్ టైం లో అల్లు ఫ్యామిలీ కటౌట్, మెగా ఫ్యామిలీ గురించి ఎక్కడ ప్రస్తావించకుండా ఉండడం లాంటి పాయింట్స్ బాగా హైలైట్ అయ్యాయి.
మంచి సినిమాలపై సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీ లిక్విడ్ చేయడం జరుగుతుంది. అయితే పుష్ప 2 సినిమా ఎలా ఉంది అనే విషయంపై కూడా మెగా కాంపౌండ్ నుంచి ఒక్క చిన్న వార్త కూడా రాలేదు. సినిమా విడుదలై 1000 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టినప్పటికీ.. అన్ని రికార్డులు తిరగరాస్తున్నప్పటికీ మెగా ఫ్యామిలీ నుంచి మాత్రం ఉలుకు పలుకు లేదు.
అయితే తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే డిప్యూటీ ముఖ్యమంత్రి.. ఆంధ్రప్రదేశ్ అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీట్ పెట్టారు. ఇందులో అల్లు అర్జున్ పేరు ఎక్కడా ప్రస్తావించక పోయినప్పటికీ.. కలిసి ఉంటే స్ట్రాంగ్ గా నిలబడతాము.. లేకపోతే పడిపోతాము అంటూ ఉన్న ఆ ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. చాలామంది ఆర్ట్వీట్ అల్లు అర్జున్ కోసమే అని అభిప్రాయపడుతున్నారు.
దీనికి ముఖ్య కారణం ఆ ట్వీట్ వెలువడిన సమయం. సరిగ్గా అల్లు అర్జున్ అరెస్ట్ అయిన కాసేపటికి ఆ ట్వీట్ బయటికి రావడంతో అల్లు అభిమానులు దీని వెనక ఏదో కుట్ర ఉంది అని అంటున్నారు.