ఒకప్పుడు తెలుగు సినిమాలు అంటే కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితమయ్యేవి.. అయితే ప్రస్తుతం వస్తున్న యంగ్ సెన్సేషన్ డైరెక్టర్స్.. తెలుగు సినిమా స్కోప్ పెంచడంతోపాటు ఫిలిమ్ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో సందీప్ రెడ్డివంగా ఒకరు. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొత్త వరవడికి నాంది పలికిన సందీప్ రెడ్డి.. ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు.
తీసిన సినిమాలు చాలా తక్కువ అయినప్పటికీ వాటి ఇంపాక్ట్ బాక్స్ ఆఫీస్ పై బలంగా ఉండేలా చూసుకున్నాడు సందీప్ రెడ్డి. అర్జున్ రెడ్డి సినిమాతో అందరికీ తెలిసిన ఒక సామాన్యమైన కథను తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించే విధంగా తెరకెక్కించాడు. ఒక రకంగా చెప్పాలి అంటే నాగార్జున శివ సినిమాతో రాంగోపాల్ వర్మ ఏ రేంజ్ సంచలనం సృష్టించాడు సందీప్ రెడ్డి వంగ.. అర్జున్ రెడ్డి చిత్రంతో ఆ రేంజ్ సంచలనాన్ని సృష్టించాడు. ఇక ఇదే సినిమాని షాహిద్ కపూర్ తో బాలీవుడ్ లో రీమేక్ చేసి నార్త్ ఆడియన్స్ మనసు దోచుకున్నాడు.
అయితే సందీప్ రెడ్డి సినిమాలు ఎంత వైలెంట్ గా ఉంటాయో అందరికీ తెలుసు.. అలాగే అతను తీసే నెక్స్ట్ సినిమాలో అంత కంటే వైలెంట్ గా ఉంటాయి అని అందరు అభిప్రాయపడ్డారు…ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి తో ప్రస్తావించినప్పుడు.. అది ఇంకా ఎక్కువగా ఉంటుంది.. అని సందీప్ రెడ్డి సమాధానం ఇచ్చారు. చెప్పినట్లుగానే రణబీర్ కపూర్, రష్మిక కాంబోలో తెరకెక్కించిన యానిమల్ మూవీలో వైలెన్స్ కి అన్ని బోర్డర్స్ క్రాస్ చేసేసాడు.
గత ఏడాది డిసెంబర్ 1 న విడుదలైన ఈ చిత్రం భాషతో సంబంధం లేకుండా ప్రతి దగ్గర బాక్స్ ఆఫీస్ కొల్లగొట్టే రికార్డులను అందించింది. 1000 కోట్లకు పైగా సంపాదించి పెట్టిన ఈ చిత్రం అప్పటివరకు సందీప్ రెడ్డి వంగాన్ని విమర్శిస్తున్న ఎందరికో సమాధానంగా మిగిలింది. చాలా తక్కువ మంది డైరెక్టర్స్ ముందుగానే హింట్ ఇచ్చి మరి ఇట్లు సాధిస్తూ ఉంటారు.. ఈ మూవీ సక్సెస్ తో సందీప్ రెడ్డి ఆ కోటాలో చేరిపోయారు. ఇక ఈ మూవీకి సీక్వెల్ గా రాబోయే యానిమల్ పార్క్ చిత్రం మరింత వైలెంట్ గా ఉంటుందో చూడాలి. మొత్తానికి సినీ ఇండస్ట్రీలో ఓ సంచలనంగా యాఅనిమల్ సినిమాకి నేటితో ఏడాది పూర్తయింది.