Wednesday, September 22, 2021

జగన్ ఇళ్ల పట్టాల పంపిణీలో రగడ

ముఖ్యమంత్రి జగన్ ప్రవేశ పెట్టిన ఇళ్ల పట్టాల పంపిణీలో రగడ జరిగింది. పచ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లు లో ఇళ్ల పట్టాల పంపిణీలో రగడ చోటు చేసుకుంది. ఇళ్ల పట్టాల పంపిణీ సక్రమంగా సాగడం లేదంటూ ఉండి టిడిపి ఎమ్మెల్యే రామరాజు విమర్శించారు. దీనితో రామరాజు పై వైసిపి కన్వీనర్ నరసింహరాజు వెంటనే మాటల దాడికి దిగారు. స్టేజి పైనే ఇద్దరూ విమర్శలు చేసుకున్నారు. దీనితో టిడిపి, వైసిపి కార్యకర్తల మధ్య ఆందోళన మొదలైంది. ఇరి వర్గాలకు సీనియర్ నాయకులు పోలీసులు సర్ది చెప్పారు.

ఇదిలా ఉండగా అమరావతిలో 54 వేల ఇళ్ల పట్టాలు అందిస్తామంటే.. ప్రతి పక్షాలు అందుకు అడ్డు పడుతున్నాయని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వద్దని హై కోర్టు లో పిల్ కూడా దాఖలు చేశారని జగన్ విమర్శించారు. ఎవరైనా ఇళ్ల పట్టాలు రానివారు దాఖలు చేసుకుంటూ వారికి 3 నెలల్లో ఇస్తామని జగన తెలిపారు. కొందరి కుట్రల వలన ఈ కార్యక్రమం ఆలస్యం అవుతుందని.. న్యాయ పరమైన చిక్కులు తొలిగిన వెంటనే సర్వ హక్కుల పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. పాదయాత్రలో ఇల్లు లేని వారి ఇబ్బందులు చూశానని.. అద్దెలు కట్టలేక పేదలు ఇబ్బందులు పడడం చూశానని అన్నారు. ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇస్తుంటే పసుపు మొఖాలు ఎర్రగా మారుతున్నాయని టిడిపి నాయకులను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

Latest Articles