Wednesday, September 22, 2021

పిల్లలకు నైతిక విలువలు చెప్పాల్సిన మీరే ఇలా చేస్తే ఎలా సారూ

వ్యక్తి జీవనం అతను పెరిగిన వాతావరణం, విద్యా బుద్దులు చెప్పిన గురువు లపై ఆధారపడి ఉంటుంది అంటారు. అంటే గురువుకు మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే ‘మాతృదేవోభవ, పిత్రు దేవోభవ, ఆచార్య దేవోభవ’ అని మన తల్లిదండ్రు లతో సమానమైన స్థానం ఇచ్చారు. గతంలో ఉపాధ్యాయులకు సామాజిక బాధ్యత ఉండేది. తాము కేవలం చదువు చెప్పడం వరకే పరిమితం అనే భావనను పక్కనపెట్టి మంచి నడవడిక ఉన్న సమాజాన్ని తయారు చేయడంలో భాగస్వాములం అని ఫీయ్యేవారు.

ఒకప్పుడు ‘బతకలేక బడిపంతులు’ అనే స్థాయి నుంచి నేడు వేలు, లక్ష రూపాయల్లో జీతాలు కుప్పలు తెప్పలుగా సె లవు దినా లతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతున్నారు ఆధునిక ఉపాధ్యాయు లు. ఇలా వీలైనంత ఖాళీ సమయం దొరుకుతుండడంతో సమాజంలో ఉపాధ్యాయుడు అన్న తమ పదవికి ఉన్న గౌరవానికి కళంకం తెచ్చే విధంగా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సాధారణంగా ఉపాధ్యాయు లు రాజకీయ సభలో కనపడడమే తప్పు అని భావిస్తుంటే.. సాక్షాత్తూ ‘ఆంధ్ర’ గౌరవానికి ప్రతీక అయిన ఆ విశ్వవిద్యాయం వైస్‌ ఛాన్సర్‌ ఏకంగా అధికార పార్టీ కార్యకర్త లు నిర్వహించిన ఓ సమావేశానికి హాజరై ఏకంగా ఉపన్యాసాలు కూడా ఇచ్చేశారు. విషయంలోకి వెళితే..

పైన ఫొటోలో ప్రసంగిస్తున్నది ఎవరో గుర్తు పట్టారా?. మన ‘ఆంధ్రా’లో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన యూనివర్సిటీ వైస్‌ ఛాన్స లర్‌ గారు. ఆయన ప్రసంగిస్తున్నారంటే ఏదో యూనివర్సిటీ సెమినార్‌ కాబోలు అనుకునేరు. మీరు భలేవారే. అది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అభిమానులు రన్‌ చేస్తున్న ‘అన్నకోసం.కాం’ వెబ్‌సైట్‌ సభ్యుల సమావేశం. ఇటీవల వీరు విశాఖలో ఓ గెట్‌ టు గెదర్‌ ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర యూనివర్శిటీ వీసీ ప్రసాదరెడ్డి గారిని ఆహ్వానించారు. వారు పిలిచిందే తడవుగా ఆయన ఈ సమావేశానికి రావడమే కాదు.. స్టేజ్‌ మీద ఉపన్యాసం కూడా దంచేశారు.

ప్రతిష్ఠాత్మకమైన విశ్వవిద్యాలయానికి వైస్‌ ఛాన్సలర్‌ అయి ఉండి ఇలా ఒక రాజకీయ పార్టీ అభిమానుల సమావేశానికి హాజరై ప్రసంగించడం ఎంత వరకూ నైతికతో ఆయన గానీ, ఆయన్ను ఆ కార్యక్రమానికి ఆహ్వానించిన వారు గానీ ఆలోచించుకుని ఉంటే బాగుండేది. స్టేజ్‌ వెనుక దివంగత ముఖ్యమంత్రి వై.యస్‌. రాజశేఖరరెడ్డిగారి బొమ్మ పక్కనే ఉన్న వైసీపీ గుర్తు ఫ్యాను ఈ సమావేశం రాజకీయ పార్టీకి సంబంధించినదేనని చెప్పకనే చెబుతోంది. దైవంతో సమానమైన ఆచార్యుని పదవిలో ఉన్న ఆయన్ను వైసీపీ శ్రేణులు తరచూ కలుస్తూ ఫొటో లు దిగుతుండడం ఇటీవలఎక్కువైపోయింది. ఎంత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి సన్నిహితుడు, సామాజికవర్గ సహచరుడు అయినా ఇలా ఉన్నతమైన పదవిలో ఉండి దానికి కళంకం తేవడం మాత్రం ఆక్షేపణీయమే. పిల్లలకు నైతిక విలువలు చెప్పాల్సిన మీరే ఇలా చేస్తే ఎలా సారూ అని ప్రజు నిలదీసే రోజు రాకుండా చూసుకుంటే ఆచార్యు వారికి గౌరవం.

Latest Articles