బీజేపీలో జనసేన విలీనమా? తిరుపతిలో పవన్ సంచలన వ్యాఖ్యలు

0
1621

జనసేన అధినేత, సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరుపతి లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశానికి మోడీ, అమిత్ షా లే కరెక్ట్ అని అన్నారు. గతంలో ఎన్నికల ముందు బిజెపిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన పవన్ ఇప్పుడు ఇలా మాట్లాడడం ఆసక్తి రేకిస్తుంది. ఆంధ్రప్రదేశ్ కి రెండు పాచిపోయిన లడ్డులు ఇచ్చారంటూ మోడీ పై గతంలో పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడు బిజెపిపై తన తీరు మార్చుకోవడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఇప్పట్లో మోడీ ని ఢీ కొట్టడం ఎవరికైనా కష్టమని పవన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే బిజెపి సన్నిహితంగా మెలగడం మంచిదని పవన్ భావిస్తున్నట్లు ఉన్నారు. అయితే దీనిపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల లోపు బిజెపితో పొత్తు కానీ లేక కాంగ్రెస్ లో ప్రజారాజ్యం విలీనం చేసినట్లు బీజేపీలో జనసేన విలీనం చేయవచ్చనే అనుమానాలు వినిపిస్తున్నాయి.

బీజేపీలో జనసేనకు విలీనం చేయాల్సిందిగా అమిత్ షా అడిగారని గతంలో పవన్ స్వయంగా చెప్పడం.. ఇప్పుడు ఈ దేశానికి మోడీ, అమిత్ షా లే కరెక్ట్ అని చెప్పడం చూస్తే బీజేపీలో జనసేన విలీనం చేయడం ఖాయమనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎలాగూ గత ఎన్నికల్లో పవన్ పార్టీనీ ఎవరూ నమ్మలేదు కనుక.. బీజేపీలో విలీనం చేస్తేనే బెటర్ అని కొందరు పవన్ అభిమానులు కూడా భావిస్తున్నట్లు తెలుస్తుంది. బీజేపీలో విలీనం చేస్తే ఆంధ్రప్రేదేశ్ బిజెపి పార్టీకి పవన్ ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతాడని, అదృష్టం కలసి వచ్చి మరో సారి దేశంలో మోడీ గాలి వీస్తే తమ అభిమాన నటుడు పవన్ ముఖ్యమంత్రి అవుతాడని కొందరు అభిమానులు భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే.. మరి కొందరు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు. దమ్ము ఉన్న నాయకుడు అయితే.. ఒంటరిగా పోటీ చేసి ముఖ్యమంత్రి అవ్వాలని.. ఇలా మోడీ పరపతిని అడ్డం పెట్టుకొని పవన్ ముఖ్యమంత్రి కావడం తమకు ఇష్టం ఉండదని చెబుతున్నారు. మరి తన అన్న చిరంజీవి కాంగ్రెస్ లో ప్రజారాజ్యం విలీనం చేసినట్లు పవన్ కళ్యాణ్ కూడా బీజేపీలో జనసేన విలీనం చేస్తాడో, లేదో త్వరలోనే తెలిసే అవకాశాలు ఉన్నాయి.