తెలుగు సినిమాలు హిట్ అవ్వడానికి స్టోరీ ఎంత ముఖ్యమో సాంగ్‌లకు స్టెప్పులు కూడా అంతే ముఖ్యం.. అలా సినిమాలకు తన స్టైల్ కొరియోగ్రఫీతో అద్భుతమైన రికార్డులు తెచ్చిన స్టార్ కొరియోగ్రాఫర్ జానీ. డి రియాలిటీ షోలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న జానీ మాస్టర్ కు ఫ్యాన్ బేస్ బాగానే ఉంది. తెలుగులోనే కాకుండా పాన్ ఇండియన్ రేంజ్ లో చిత్రాలకు కొరియోగ్రఫీ అందించాడు జానీ మాస్టర్.
ముఖ్యంగా రామ్ చరణ్ సాంగ్స్ కి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ సూపర్ గా సెట్ అవుతుంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం మూవీ లో జానీ మాస్టర్ కొరియోగ్రఫీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీలో జిగేల్ రాణి పాటకు జానీ మాస్టర్ అందించిన కొరియోగ్రఫీకి కుర్ర కారు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత తమిళ్లో విజయ్ నటించిన మాస్టర్ చిత్రానికి కూడా ఆయనే కొరియోగ్రఫీ అందించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
మంచి సక్సెస్ఫుల్ కొరియోగ్రాఫర్ గా ఒకప్పుడు వార్తల్లో నిలిచిన జానీ మాస్టర్ ఇప్పుడు ఇరుక్కున్న కేసుల నేపథ్యంలో సంచలనంగా మారారు. గత కొన్ని రోజులుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆయన పేరు మారుమోగుతోంది. మైనర్ గా ఉన్నప్పటి నుంచి జానీ మాస్టర్ తనపై వేధింపులు జరుపుతున్నారు అంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అంతే కాదు జానీ మాస్టర్ కు 14 రోజులపాటు చంచల్గూడా సెంట్రల్ జైల్లో రిమాండ్ విధించారు. అయితే ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు.
ప్రస్తుతం జానీ మాస్టర్ కి ఈ కేసు పుణ్యమా అని వరుస దెబ్బలు తగులుతున్నాయి. అవార్డు పోవడంతో పాటు ఇప్పుడు డాన్సర్స్ అసోసియేషన్ నుంచి కూడా ఆయన్ను శాశ్వతంగా తొలగించారు. ఆదివారం నిర్వహించిన డాన్సర్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా జోసఫ్ ప్రకాష్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇంకా ఈ కేసుపై ఎవరికి పూర్తిగా అవగాహన లేని సందర్భంలో ఆయనను ఇలా అసోసియేషన్ నుంచి తొలగించడం ఎంతవరకు కరెక్ట్ అనేది కొంతమంది అభిప్రాయం.