కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజాగా కంగువా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ ఎపిక్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీను మేకర్స్ ఓ రేంజ్ లో ప్రమోట్ కూడా చేశారు. ఇక ఏ మూవీ స్టోరీ గురించి.. నటీనటు ల నటన గురించి.. సినిమా విడుదలకు ముందు ఓ రేంజ్ లో ప్రచారం జరిగింది. బాహుబలిని తలపించే చిత్రం అవుతుంది అని అందరూ భారీగా ఈ మూవీ గురించి మాట్లాడారు. కానీ కట్ చేస్తే థియేటర్లలో విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.
350 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కించారు. అయితే ఈ మూవీకి సగం కూడా కలెక్షన్స్ రాలేదు అన్న టాక్ నడుస్తోంది. మొదటిరోజు మొదటి షో తోటే ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ స్టార్ట్ అయింది.. దీంతో రెండో రోజుకి కలెక్షన్స్ భారీగా పడిపోయాయి.. భారీ హీట్ అవుతుంది అని ఆశించిన చిత్రం కాస్త అతి పెద్ద డిజాస్టర్ గా మిగిలింది.
ఇక మూవీ విడుదలకు ముందు ఏర్పడిన క్రేజ్ నేపథ్యంలో చిత్రానికి సంబంధించిన ఆన్లైన్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ఫ్యాన్సీ మొత్తానికి అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. మామూలుగా థియేటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాత ఓటీటీ లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 13 నుంచి ఈ చిత్రం తెలుగు, తమిళ్ తో సహా పలు భాషలలో అమెజాన్లో స్ట్రీమింగ్ అవ్వబోతోంది.
ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన హై క్వాలిటీ డిజిటల్ ప్రింట్ లీక్ అవ్వడం అమెజాన్ ప్రైమ్ కు భారీ షాక్ గా మిగిలింది. మూవీ థియేటర్లలో విడుదలైన 17 రోజులకే ఆన్లైన్లో హెచ్డి ప్రింట్లు వచ్చేసాయి. రికార్డు ధరతో రేట్లు పెట్టి భారీ మొత్తంతో కొనుక్కున్న చిత్రం డిజాస్టర్ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఓటీటీ లోకి వస్తే భారీ వ్యూస్ వస్తాయి అని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు వ్యూవర్స్ కౌంట్ పడిపోయే అవకాశం ఉంది అని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అమెజాన్ కంగువ మూవీ స్ట్రీమింగ్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.