‘నాకు ఇంకా పెళ్లి కాలేదు.. నాకు పుట్టిన ఈ బిడ్డ నాకు వద్దు’

0
1875

పెళ్లి కాకుండానే కడుపు తెచ్చుకున్న ఓ బాలిక.. తొమ్మిది నెలలు నిండగానే ఓ బిడ్డకు తల్లి అయింది. అయితే తనకు పుట్టిన బిడ్డను ఆసుపత్రిలోనే వదిలి వెళ్లే ప్రయత్నం చేసింది. ఆ వివరాలలోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ లోని బారెల్లీలో ఓ మైనర్‌ బాలిక తన తండ్రితో కలిసి ఓ ఆసుపత్రికి వచ్చింది. అయితే ఆమె గర్భవతి అని.. తొమ్మిది నెలలు నిండాయని చెప్పి ఆమెకు ప్రసవం చేశారు ఆసుపత్రి సిబ్బంది. దీనితో ఆ బాలిక ఓ ఆడ బిడ్డకు జన్మ ఇచ్చింది. అయితే.. పుట్టిన బిడ్డను ఆసుపత్రిలోనే వదిలి వెళ్లే ప్రయత్నం చేసింది ఆ బాలిక. తనకు ఇంకా పెళ్లి కాలేదని.. ఇప్పుడు ఆ బిడ్డతో బయటికి వెళితే సమాజంలో తమ పరువు పోతుందని వదిలి వెళ్లే ప్రయత్నం చేసింది.

ఈ ఘటన ని గమనించిన ఆసుపత్రి సిబ్బంది వారిని పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. అయితే, తన కూతురు కడుపు తో ఉన్న విషయం తనకు తెలియదని.. కడుపు నొప్పి అని చెబితే ఆసుపత్రికి తీసుకువచ్చామని ఆ బాలిక తండ్రి చెబుతున్నాడు. పోలీసులు ఆ బాలికను విచారించగా.. తనకు ఇంకా పెళ్లి కాలేదని.. ఇప్పుడు ఆ బిడ్డతో బయటికి వెళితే సమాజంలో తమ పరువు పోతుందని, తాను తీసుకెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. శిశు సంక్షేమ కమిటీ ఆ బాలికకు ఎంత చెప్పినా ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీనితో బిడ్డను తీసుకెళ్లడం ఆ తల్లికి ఇష్టం లేకపోతే.. రెండు నెలల తర్వాత తామే శిశు సంక్షేమ సెంటర్‌ కి తీసుకొని వెళతామని.. పిల్లలు లేని వారికి ఆ శిశువుని ఇచ్చేస్తామని శిశు సంక్షేమ కమిటీ సభ్యులు తెలిపారు.