మనిషి ఆయుష్షును పెంచేందుకు ఆయుర్వేదంలో అనేక రెమిడీస్ ఉన్నాయి. శరీరంలోని ఏ భాగానికైతే సమస్యలు వస్తాయో ఆ భాగంపై మాత్రమే ప్రభావం చూపుతూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఆరోగ్యంగా ఉంచడంలో ఆయుర్వేదం ఎంతో ఉపయోగపడుతుంది.
ప్రకృతి అందజేసే చెట్ల పండ్లు, మూలికలతో అనేక మందులను తయారు చేసి అల్లోపతికి కూడా లొంగని వ్యాధులను కూడా కట్టడి చేయడంలో ఆయుర్వేదం అద్భుతంగా పని చేస్తుందనడంలో సందేహం లేదు.
ఆయుర్వేదంలోని చిట్కాలకు కొదువ లేదు. ఎన్నో చిట్కాలు మనం వినే ఉంటాం. అందులో ఖర్జూర పాల గురించి అవి కలిగించే ప్రయోజనాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఖర్జూర, పాలతో బోలెడు ప్రయోజనాలు..
ఖర్జూర పండులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇది పండుగానే కాకుండా. ఎండినప్పుడు కూడా అదే పోషక విలువలతో ఉంటుంది. ఇక ఖర్జూర పండును పాలతో కలిపి తీసుకుంటే వచ్చే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
ఖర్జూర పాలు తక్షణ శక్తిని ఇస్తాయి. ఇందులో పోషకాలు, మినరల్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఖర్జూరలో ఉన్న పోషక విలువలు, పాలలో ఉన్న పోషక విలువలతో కలిసినప్పుడు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు, న్యూట్రీషియన్స్ చెప్తున్నారు.
ఖర్జూర పాల తయారీ..
నాలుగు ఖర్జూర పండ్లను తీసుకొని గింజను తొలగించి మెత్తగా చేసుకోవాలి. వాటిని ఒక గ్లాస్ పాలతో కలిపి బాగా మరిగించాలి. ఆపాలను బాగా అలసట, నీరసంగా ఉన్న వారికి పట్టించాలి.
ఇలా చేస్తే వారికి తక్షణ శక్తి అందుతుంది. దీంతో పాటు జీర్ణ సంబంధ వ్యాధులను కూడా దూరం చేస్తుంది. గ్యాస్, ఎసీడిటీ, మలబద్దకం, అజీర్ణం వంటి సమస్యలను దరి చేరనివ్వకపోగా..
ఒక వేల ఉంటే మాత్రం దూరం చేస్తుంది. జీర్ణక్రియ సాఫీగా ఉండేలా క్రమ పరుస్తుంది. దీంతో పాటు కంటి సమస్యలను కూడా తొలగిస్తుంది. రేచీకటితో బాధపడేవారు క్రమంగా ఉపశమనం పొందవచ్చు.
శరీరంలో రక్త పరిమాణం తక్కువగా ఉన్న వారికి ఇది ఉపయోగపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి.. మంచి కొలెస్ట్రాల్ వృద్ది చెందుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా దృఢ పరుస్తుంది. మెదడు చురుగ్గా పని చేస్తుంది.
సెక్స్ సమస్యలు కూడా దూరం..
వీటితో పాటు ఖర్జూర పాలతో మరిన్ని అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వంధ్యత్వంతో బాధపడేవారికి ఇది మంచి రెమెడీగా పని చేస్తుంది. ఇందులో ఉన్న విటమిన్లు, మినరల్స్ శుక్రకణాల వృద్ధికి కూడా తోడ్పడతాయి.
స్ర్తీలలో బహిష్టు సమయంలో రక్త హీనతను కూడా కవర్ చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఖర్జూర పాలతో వందలాది ప్రయోజనాలు ఉన్నాయనే చెప్పుకోవచ్చు. అందుకే ఆయుర్వేద నిపుణులు కూడా దీన్ని విరివిగా సూచిస్తున్నారు. ఇది కూడా ఒక పద్ధతి ప్రకారం తీసుకోవాలి. అతి ఏదైనా చేటే.. కాబట్టి తీసుకునే సమయంలో మాత్రమే తీసుకోవాలి.