మందు బాబులకు షాక్ ఇచ్చిన వైఎస్ జగన్

0
754

మద్యపానం నిషేధం దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేయనుంది. ఈ మేరకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. మందు బాబులకు షాక్ ఇస్తూ మద్యం ధరలను భారీగా పెంచింది. మద్యం సీసాల గరిష్ట ధరపై భారీగా పన్ను విధించింది. దీనితో మద్యం ధర మందు బాబులకు మరింత భారం కానుంది. మద్యం దుకాణాలు, బార్ లలో ఈ పన్ను వసూలు చేయనుంది. మధ్య నిషదం కార్యక్రమం అమలులో భాగంగా మద్యం బాటిళ్లపై ARET పేరిట అడిషనల్ రిటైల్ ఎక్సైజు టాక్స్ ని వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో బాటిల్ పై కనీసం రూ. 10 పన్ను నుండి గరిష్టంగా రూ. 250 వరకు పన్ను విధించారు.

నేటి నుండి నూతన మద్యం పాలసీ అమలులోకి వచ్చిన తరుణంలో పెరిగిన ధరలు కూడా అమలులోకి రానున్నాయి. దేశీయంగా తయారైన మద్యం, విదేశీ మద్యం , వైన్ ఇతర వెరైటీల మద్యం పై ARET పేరిట అడిషనల్ రిటైల్ ఎక్సైజు టాక్స్ ని విధించారు. 90 ml బాటిల్ కి రూ.10 పన్ను విధించారు. ఇక పరిమాణం పెరిగే కొద్దీ పన్ను రెట్టింపు చేస్తూ.. ఆదేశాలు జారీ చేశారు. గరిష్టంగా 250 వరకు పన్ను పెరగ నుంది. నిర్దేశించిన ధరల కంటే ఎక్కువ ధరలకు మద్యం అమ్మినా.. బెల్టు షాప్ లు నడిపినా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. గ్రామాల్లో మద్యం మహమ్మారిని తరిమేందుకు.. గ్రామం వార్డ్ సచివాలయాల్లో దాదాపు 15 వేల మహిళా కానిస్టేబుళ్లను నియమించింది.