కుటుంబాలలో విషాదం నింపిన ప్రేమ జంట

0
3382

ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడ పుడుతుందో.. ఎవరితో పుడుతుందో తెలియదని చెబుతూ ఉంటారు. అలాంటి ప్రేమే ఆ ఇద్దరి మధ్య పుట్టింది. ఆ అమ్మాయి పిజి వరకు చదువుకుంది. ఓ ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పని చేస్తుంది. అయితే.. అదే స్కూల్ లో బస్సు డ్రైవర్ పని చేస్తున్న వ్యక్తిని ప్రేమించింది. ఆ వ్యక్తి కేవలం పదో తరగతి వరకు చదుకున్నాడు. అయితే తమ ప్రేమను పెద్దవాళ్లకు చెప్పలేక.. తీవ్ర వేదన అనుభవించి చివరికి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ వివరాలలోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా లో తూర్పుపాలెం గ్రామానికి చెందిన చిక్క రాముడు, సూర్యకుమారి భార్యాభర్తలు ఉండగా.. వారు నిరుపేద కుటుంబానికి చెందినవారు. అయినా కష్టపడి తమ కూతురు ప్రశాంతిని పీజీ దాకా చదివించారు.

అయితే తల్లి తండ్రులకు చేదోడు వాదోడు గా ఉండడానికి ప్రశాంతి ఓ ప్రైవేట్ స్కూల్‌ టీచర్‌ గా పని చేస్తూ ఉంది. అయితే.. అదే స్కూల్ లో యాలంగి రమేష్‌ అనే ఓ యువకుడు బస్సు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. అయితే తమ కులాలు వేరు కావడంతో ఇంట్లో చెప్పడానికి భయపడ్డారు. ఇంతలో ఇంట్లో ప్రశాంతికి మరో యువకుడితో పెళ్లి కుదిర్చారు. దీనితో ప్రేమించిన సంగతి ఇంట్లో చెప్పలేక.. ప్రశాంతి ఎంతో మదనపడింది. బయటికి చెప్పలేక.. ఇంట్లో కుదిర్చిన సంబంధం వద్దనలేక మానసిక వేదన అనుభవించింది. దీనితో ఇద్దరూ కలసి మానసిక వేదన అనుభవించి.. చివరికి ఆత్మహత్య చేసుకొని.. ఇద్దరి కుటుంబాలలో విషాదం నింపారు.