సమాజం హర్షించదని అతడితో కలసి ఆత్మహత్య

0
20260

ఆ యువతి తన జీవితం మొత్తం హుందాగా నడుచుకుంది. తన 28 ఏళ్ల వయసులో ఎక్కడా కూడా పల్లెత్తు మాట అనిపించుకోలేదు. ఆమె ఉండే ఊరిలో కూడా మంచి గొరవం ఉంది. M. Tech. చదివి ఉద్యోగం చేసుకుంటూ అందరితో మర్యాదగా ఉండేది. తన చిన్న తనం నుండి కూడా అందరితో మర్యాదగా మెలిగేది. అయితే.. ఎంత చదివి చివరికి ఏమి లాభం? చివరికి తన కన్నా 10 ఏళ్ల చిన్నవాడితో ప్రేమలో పడి.. ఈ విషయాన్నీ సమాజం హర్షించదని అతడితో కలసి ఆత్మహత్య చేసుకుంది. ఆ వివరాలలోకి వెళితే.. గన్నవరం మండలం తెంపల్లికి చెందిన నాగబోయిన గౌతమి (28).. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గా పని చేస్తుంది. ఆమెకు ఇటీవలే నిర్చితార్ధం కూడా జరిగింది. వచ్చే నెలలో పెళ్లి కూడా ఉంది.

అయితే ఆమె అప్పటికే పాలిటెక్నిక్‌ చదువుతున్న లోకేష్ అనే 19 ఏళ్ల యువకుడిని ప్రేమించింది. అయితే.. సమాజం తన పేమను అంగీకరించదని ఆమెకు తెలుసు. అందుకే.. ఇద్దరు కలసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించున్నారు. దానికోసం ఒక హోటల్‌ లో రూమ్ తీసుకొని విషం తాగారు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు వదలగా.. ఆ యువకుడు మాత్రం కోన ఊపిరితో ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా.. యువతిని పోస్టుమార్టానికి తరలించారు. ఆ యువకుడిని ఆసుపత్రికి తరలించారు. గౌతమి మరణంతో ఆ ఊరిలో విషాద ఛాయలు నెలకొన్నాయి. చిన్నప్పటి నుండి తమతో ఎంతో వినయంగా ఉండే గౌతమి ఇక లేదని తెలిసి గ్రామస్తులు కన్నీరు మున్నేరు అవుతున్నారు. 19 ఏళ్ల యువకుడిని పెళ్లి చేసుకుంటానని చెప్పినా ఆమె తల్లి తండ్రులు వినకపోవడంతోనే గౌతమి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు.