మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ లు హీరోలుగా నయనతార హీరోయిన్ గా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ఈ సంక్రాతి సందర్భంగా విడుదల అయింది. గతః సంక్రాంతికి వచ్చిన వెంకటేష్, అనిల్ రావిపూడి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కమర్షియల్ గా హిట్ అయింది. దానిని ఆదర్శంగా తీసుకున్న మెగాస్టార్ అనిల్ కి అవకాశం కల్పించారు. మరి గత సంక్రాతిలాగా అనిల్ మరో హిట్ కొట్టాడా లేదా? అనేది చూద్దాం.
కథ: సెక్యూరిటీ చీఫ్ ఆఫీసర్ గా చేసే వరప్రసాద్ (చిరు) పెళ్లికాక ముందు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్. అతడికి జీవీఆర్ గ్రూప్స్ కంపెనీ బాస్ శశిరేఖ (నయనతార) పరిచయం అవ్వడంతో అది పెళ్లి దాకా వెళుతుంది. అయితే వీరి పెళ్లి శశిరేఖ తండ్రికి ఇష్టం లేకపోవడంతో ఇద్దరినీ విడదీస్తాడు. ఇంతలో వరప్రసాద్ కేంద్రమంత్రి సెక్యూరిటీని వరప్రసాద్ డీల్ చేస్తాడు. ఇంతలో ఓ పెద్ద ప్రమాదం జరుగుతుంది. అక్కడి నుండి కథ ఎలా మలుపు తిరుగుతుంది? వరప్రసాద్ మళ్ళీ తన భార్యా, పిల్లల్ని కలుస్తాడా? అనేది మిగిలిన స్టోరీ.
విశ్లేషణ: సాధారణంగా అనిల్ రావిపూడి సినిమాలలో పెద్దగా కథలకు ప్రాధాన్యం ఉండదు. ఎదో జబర్దస్త్ ఫ్లోలో కథ వెళ్ళిపోతూ.. కామెడీ పండించే పనిలోనే కథ ఉంటుంది. ఇప్పుడు కూడా అదే కొనసాగింది. కథలో ఎలాంటి మలుపులు, మతిపోయే ట్విస్ట్ లు అస్సలు ఉండవు. సాదా సీదాగా సాగిపోతూ ఉంటుంది. కామెడీ కూడా కొత్తగా ఏమి అనిపించదు.
అయితే చిరంజీవి యంగ్ లుక్, కామెడీ టైమింగ్ అభిమానులు ఫిదా అవ్వొచ్చు. స్లోగా సాగె కథలో వెంకటేష్ రావడంతో కొద్దిగా హైప్ వస్తుంది. అది కూడా నామమాత్రమే. ఇది చిరంజీవి సినిమా అని చెప్పుకునేలా ఫాన్స్ కూడా ఫీల్ అవ్వడం కష్టమే. ఒక జబర్దస్త్ లాగా కామెడి చూసేవాళ్ళకి ఒక విధంగా నచ్చే అవకాశాలు ఉన్నాయి.
చివరిగా: కథలో హాస్యం ఉండాలి.. హాస్యమే కథ కాకూడదు
రేటింగ్: రెండున్నర

