తెలుగు సినీ ఇండస్ట్రీలో అద్భుతమైన చిత్రాలు చేసి విలక్షణమైన నటుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి మోహన్ బాబు. ఆయన కుటుంబం నుంచి ముగ్గురు పిల్లలు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఆయన రేంజ్ నట వారసులుగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారని చెప్పాలి. మంచు ఫ్యామిలీ ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీలో వైరల్ అవుతూ ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. గత వారం రోజులుగా మంచు కుటుంబానికి సంబంధించిన తగాదాలు ఓ రేంజ్‌కి పెరిగాయి.
ఒకరిపై ఒకరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడం.. దాడులు చేసుకోవటం.. వాయిస్ రికార్డింగ్‌లో విడుదల చేయడం.. ఇలా ఒకటి కాదు చాలా పెద్ద కథే నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని కాస్త సీరియస్‌గా తీసుకున్న పోలీసులు మంచు సోదరులు ఇద్దరినీ స్టేషన్‌కు పిలిచి మరి మందలించారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవలు కాస్త సద్దుమనుగుతాయి అని అందరూ భావించారు. కానీ మళ్ళీ తిరిగి మనోజ్.. మరొక కంప్లైంట్ తో సంచలమైన ఆరోపణలు చేస్తున్నారు.
డిసెంబర్ 14 న మోహన్ బాబు భార్య పుట్టిన రోజు సందర్భంగా..జల్పల్లిలోని నివాసంలో మంచు మనోచ్చి తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నారు. అనుకోకుండా ఆ సమయంలో కరెంటు పోవడంతో.. జనరేటర్ ని ఆన్ చేయడానికి ప్రయత్నించిన కుదరలేదు. దీంతో రాత్రంతా కరెంటు లేక నానా అవస్థలు పడ్డారు. అయితే పొద్దున జనరేటర్ ని పరిశీలించినప్పుడు అందులో పంచదార పోసినట్లు గమనించారు. మంచు విష్ణు, అతని స్నేహితులు కలిసి ఈ పని చేసినట్లు అనుమానించిన మనోజ్ గొడవకు దిగాడు. దీంతో ఇద్దరూ పరస్పరం కొట్టుకునే వరకు వెళ్లారట.
ఈ విషయంపై మనోజ్ మరోసారి పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. ఆధారాలతో సహా మంచు విష్ణు పై అతడు ఫిర్యాదు చేశాడు. అంతేకాదు కరెంట్ ఫిక్షన్ చేసి తనతో పాటు తన కుటుంబ సభ్యుల్ని కూడా కలిపి చంపడానికి విష్ణు మాస్టర్ ప్లాన్ వేశాడు అని ఆరోపించారు. మనోజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కూడా ప్రారంభించారు.