నడి రోడ్డు మీద ఉరి తీసినా తప్పు లేదు: మెగాస్టార్ చిరంజీవి

0
2800

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న డాక్టర్ ప్రియాంక రెడ్డి ఉదంతంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ మేరకు చిరంజీవి ఒక వీడియో కూడా విడుదల చేశారు. ఆ వీడియోలో చిరంజీవి ఇలా అన్నారు. ‘రెండు మూడు రోజులుగా ఆడపిల్లలపై జరుగుతున్నా దారుణాలు వింటుంటే గుండె తరుక్కు పోతుంది. ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదా? అనే భావన కలుగుతుంది. మెగా మృగాల మధ్య మనము బతుకుతున్నామా? అనిపిస్తుంది. మనసు కలచివేస్తున్న ఈ సంఘటన గురించి ఒక అన్నగా, ఒక తండ్రిగా స్పదింస్తున్నాను. ఇలాంటి నేరాలు చేసిన దుర్మార్గులకు శిక్షలు చాలా కఠినంగా ఉండాలి. భయం కలిగించేలా ఉండాలి. నడి రోడ్డు మీద ఉరి తీసినా తప్పు లేదు. త్వరగా నేరస్తులను పట్టుకోవడం అభినందనీయమే. అలాగే త్వరగా శిక్ష పడేలా చూడాలి. అప్పుడే ఇలాంటి నేరాలు ఎవరైనా చేయాలంటే భయపడతాడు. ఆడ పిల్లలందరికీ నేను చెప్పేది ఒక్కటే. మీ ఫోన్ లో 100 నెంబర్ స్టోర్ చేసి పెట్టుకోండి. ఒక బజార్ నొక్కితే చాలు షీ టీం మీ వద్దకు వచ్చేస్తుంది. పోలీసుల సేవలను ఉపయోగించుకోండి. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కటి బాధ్యత.’ అని చిరంజీవి అన్నారు.