టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో అవార్డులు, ఘనతలు, రివార్డులతో చిరంజీవి టాలీవుడ్‌లో చెరగని ముద్ర వేసుకున్నారు. తన యాక్టింగ్, డ్యాన్స్ స్టైల్, సెన్సేషన్ హిట్ సినిమాలతో మెగాస్టార్‌గా ఎదిగిన ఆయన, ఇప్పటికీ కుర్ర హీరోలకు గట్టి పోటీగా నిలుస్తూ దూసుకుపోతున్నారు. ఆరుపదుల వయసులో కూడా చిరంజీవి తగ్గేదే లేదన్నట్టు దూసుకుపోతున్నారు.
ఆరు పదుల వయసులో కూడా చిరంజీవి తన యంగ్ లుక్స్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవల గార్డెన్‌లో తీసిన ఫొటో షూట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సింపుల్ అండ్ మోడ్రన్ డ్రెస్‌లో కనిపించిన చిరు, బ్లాక్ గూగుల్స్‌తో అదరగొట్టేశారు. ఈ ఫోటోలు చూసి ఫిదా అయిన ఫ్యాన్స్ “బాస్ మేనర్ ఇస్ డిఫరెంట్” అని కామెంట్స్ పెడుతున్నారు. “వయసు పెరుగుతుందో తగ్గుతుందో అర్థం కావడం లేదు” అంటూ నెటిజన్లు తెగ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
ప్రస్తుతం చిరంజీవి తన కొత్త సినిమా *విశ్వంభర* షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సోషియో ఫాంటసీ మూవీ, 2025 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అసలుకు సంక్రాంతి విడుదల కావాల్సిన ఈ సినిమా, పలు కారణాల వల్ల వాయిదా పడింది.
*విశ్వంభర* అనంతరం చిరంజీవి, *దసరా* ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నటించనున్నారు. నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. నెవ్వర్ బిఫోర్ మాస్ రోల్‌లో చిరంజీవిని చూపించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చిరు ఒక యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందనుందని టాక్. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. అలాగే కోలీవుడ్ డైరెక్టర్ మిత్రన్‌తో చిరంజీవి ఓ క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విధంగా వరుస ప్రాజెక్టులతో చిరంజీవి తన ఫ్యాన్స్‌కు మంచి వినోదాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఈ సినిమాలతో చిరు ఎలా మెప్పిస్తారో చూడాలి.